Sunday, 13 September 2026 03:54:11 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

తిరుపతి వేదికగా రాయలసీమ ఆర్కియాలజీ సర్కిల్ ఏర్పాటు చేయండి

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ప్రొ.కిషోర్ కె. బాసాని ని కలిసిన గురుమూర్తి

Date : 29 May 2023 08:23 PM Views : 561

Famous TV - జాతీయ వార్తలు / : నేడు ఢిల్లీలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ప్రొ.కిషోర్ కె. బాసాని ని కలిసిన గురుమూర్తి తెలంగాణా నుండి ఆంధ్రప్రదేశ్‌గా విభజించిన తర్వాత హైదరాబాద్‌ లోని ఆర్కియాలజీ సర్కిల్ కూడా హైదరాబాద్ సర్కిల్ మరియు అమరావతి సర్కిల్‌లుగా విభజించబడిందని ఇది 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి పని చేయడం ప్రారంభించిందని అమరావతి, చంద్రగిరి మరియు నాగార్జునకొండలో 135 స్మారక చిహ్నాలు/స్థలాలు మరియు మూడు సైట్ మ్యూజియంలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రాచీన వారసత్వ సంపదను సూచిస్తాయని ఆయనకి వివరించారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిందని, ఇందులో 9 జిల్లాలు రాయలసీమ పరిధిలోకి వస్తాయని మరియు 17 జిల్లాలు కోస్తా ప్రాంతంలోకి వస్తాయని రాయలసీమ ప్రాంతంలోని నెల్లూరు జిల్లాతో సహా 70 స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, 13 ప్రధాన కోటలు, గుడిమల్లం, వీరభద్ర & బసవన్న (లేపాక్షి) వంటి పురాతన దేవాలయాలు ఉన్నాయని ఇటీవల తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మండలం కొంతూరు సమీపంలో 11-12 శతాబ్దాల నాటి గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏఎస్‌ఐ డిపార్ట్‌మెంట్ తవ్వగా, ఆంధ్రప్రదేశ్‌లోని లక్ష మాన్యుస్క్రిప్ట్‌లలో దాదాపు 55,000 మాన్యుస్క్రిప్ట్‌లు తిరుపతిలోని విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.

భవిష్యత్తు తరానికి మన వారసత్వ సంపద అందించేందుకు స్మారక చిహ్నాలు, స్థలాలు మరియు మాన్యుస్క్రిప్ట్‌లకు మరింత ప్రాముఖ్యత ఇవ్వాలి. కావున, వీలైనంత త్వరగా తిరుపతిలో కొత్త పురావస్తు సర్కిల్‌ను రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పవలసిందిగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ప్రొ. కిషోర్ కె. బాసాని కోరగా ఈ అంశం పరిశీలించి ఏర్పాటుకు తగు చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: