Monday, 14 September 2026 07:47:01 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

విధ్యను ఆయుధంగా చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి అంబేద్కర్

Date : 06 December 2025 06:57 PM Views : 582

Famous TV - జాతీయ వార్తలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టీవీ న్యూస్: చిత్తూరు జిల్లా,చౌడేపల్లి భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించింది-జూనియర్ కళాశాల లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి గౌరవ నివాళులు సమర్పించారు.ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపల్ జయప్రకాష్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించి చిన్నతనం నుంచి తీవ్రమైన సామాజిక వివక్షను ఎదుర్కొన్నప్పటికీ, విద్యను ఆయుధంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారని చెప్పారు.బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ సహాయంతో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి పీహెచ్‌డీ పట్టా పొందారు. అనంతరం బరోడా సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు కూడా భేద భావాలను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.సామాజిక న్యాయం కోసం నిరంతర పోరాటం అంటరానితనం, సామాజిక వివక్ష నిర్మూలన తన జీవిత లక్ష్యమని భావించిన అంబేద్కర్ 1931లో మహాత్మా గాంధీజీని కలుసుకొని స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు.రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని అణగారిన వర్గాల తరఫున బలమైన వాదనలు వినిపించి ప్రత్యేక హక్కులను పొందగలిగారని అన్నారు.భారత రాజ్యాంగ రూపకర్తగా మహోన్నత సేవలు అందించారు స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగ రచనా బాధ్యతలు అప్పగించబడగా, అంబేద్కర్ అత్యంత ప్రామాణికంగా, సమానత్వం, న్యాయస్థాపన, రక్షణలను ప్రధానంగా తీసుకుని రాజ్యాంగాన్ని రూపొందించారు. అలాగే స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా దేశ నిర్మాణంలో అనన్య సేవలు అందించారని తెలిపారు.1956 డిసెంబర్ 6న ఆయన పరమపదించారు.ఆయన వర్ధంతిని పురస్కరించుకొని, దేశానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ గౌరవ నివాళులు అర్పిస్తున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు సుబ్రమణ్యం,ఎన్.ఎస్.ఎస్ పోగ్రాం ఆఫీసర్ బాలాజీ, రవికుమార్,బాల్ పోల్ రెడ్డి,సురేష్,శాంతమ్మ,రెడ్డెమ్మ,ఆదినారాయణ రెడ్డి,నౌషద్ ఖాన్,రెడ్డిభాషా,నాగార్జున, విద్యార్థులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: