Tuesday, 15 September 2026 09:26:49 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

కేంద్ర మంత్రి గడ్కరితో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి భేటీ

తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని వినతి

Date : 14 February 2024 03:40 PM Views : 672

Famous TV - జాతీయ వార్తలు / : నేడు ఢిల్లీలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రోడ్డు రవాణా శాఖామాత్యులు నితిన్ గడ్కరితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మొదటగా చెన్నై నుండి అరక్కోణం, పుత్తూరు మీదుగా రహదారి విస్తరణ గూర్చి విన్నవించిన వెంటనే స్పందించి మంజూరు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గత కొద్ది రోజులుగా పెండింగులో ఉన్న తిరుపతి ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ పనులను మొదలెట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలనీ కోరారు. నాయుడుపేట సమీపంలో విన్నమల గ్రామం మీదుగా 4 లైన్ల జాతీయ రహదారి -5 వెళుతుందని ప్రస్తుతం ఇది 6 లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయబోతున్నారని కి.మీ 57 ర్యాంపు-1 వద్ద పరిసర గ్రామాల ప్రజలు జాతీయ రహదారికి ఇరువైపులా రాకపోకలు సాగిస్తున్నారని ఇందులో వంద మందికి పైగా విద్యార్థులు పాఠశాల, హైస్కూల్ మరియు జూనియర్ కళాశాలలకు ప్రయాణిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ సచివాలయం, ఆరోగ్య క్లినిక్, రేషన్ దుకాణం, దేవాలయాలు, ప్రైవేట్ కంపెనీలు వంటి వివిధ గమ్యస్థానాలకు చేరుకోవడానికి జాతీయ రహదారిని సుమారు రెండు వేల మంది ప్రతి నిత్యం దాటుతున్నారని ప్రతి సంవత్సరం అనేక మంది విద్యార్థులు మరియు గ్రామస్తులు రోడ్డు ప్రమాదాలలో తమ ప్రాణాలను కోల్పోతున్నారని మరియు రహదారిపై ప్రమాదాల కారణంగా గాయపడ్డ వారు కూడా గణనీయంగా ఉన్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నాలుగు లేన్ల జాతీయ రహదారిని 6 లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రమాదాల తీవ్రత మరింత పెరుగుతుందనే ఆందోళన సర్వత్రా నెలకొందని అందువలన ర్యాంప్-1 వద్ద అండర్‌పాస్ ఏర్పాటు చేసేందుకు వీలైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకొవాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: