Wednesday, 29 July 2026 05:37:06 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఇంత ఘోరమా? కారణం ఎవరు ?

కోరమాండల్‌కు ‘సరిగ్గానే’ సిగ్నల్‌ అయినా... లూప్‌లైన్‌లోకి ఎందుకొచ్చింది? చెల్లాచెదురుగా పడిన కోరమండల్‌ బోగీలు

Date : 04 June 2023 03:22 PM Views : 471

Famous TV - జాతీయ వార్తలు / : గంటకు 128 కిలోమీటర్ల వేగంతో షాలిమార్‌ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌... మెయిన్‌లైన్‌లో తనదారిలో తాను వెళ్లకుండా లూప్‌లైన్‌లోకి వెళ్లి అక్కడున్న గూడ్స్‌ను ఢీకొట్టింది! పట్టాలు ఛిద్రమయ్యాయి! బోగీలు చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో... హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బెంగళూరు నుంచి హౌరా వెళ్తోంది. మరో మూడు నాలుగు క్షణాలు దాటితే మొత్తం రైలు క్షేమంగా ముందుకు వెళ్లేదే. కానీ... అప్పటికే గూడ్స్‌ను ఢీకొని చెల్లాచెదురైన కోరమాండల్‌ బోగీలు హౌరా ఎక్స్‌ప్రెస్‌ చివరి నాలుగైదు బోగీలకు ధాటిగా తగిలాయి! శుక్రవారం రాత్రి ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంపై రైల్వే అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఇది. ఇంత ఘోరానికి కారణం... కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్‌లైన్‌లో కాకుండా లూప్‌లైన్‌లోకి వెళ్లడమే అని ఒక అంచనాకు వచ్చారు. ఇలా ఎందుకు జరిగిందనదే ఇప్పుడు మిస్టరీగా మారింది! రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక... ఇతర వర్గాలు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అసలేం జరిగిందంటే... రైలు ప్రమాదం శుక్రవారం రాత్రి 6.55 గంటలకు చోటు చేసుకుంది. చెన్నై వైపు వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841) గంటకు 128 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ... బహనాగ్‌ బజార్‌ స్టేషన్‌కంటే ముందు... లూప్‌లైన్‌లో ఉన్న గూడ్స్‌ ట్రెయిన్‌ను ఢీకొట్టింది. సరిగ్గా అదే సమయంలో గంటకు 116 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌ (12864).. పట్టాలు తప్పిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలను ఢీకొట్టింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంజన్‌ లూప్‌లైన్‌లో ఉన్న గూడ్స్‌పైకి ఎక్కేసింది. గార్డు బ్రేకప్‌ వ్యాన్‌ మాత్రం మెయిన్‌లైన్‌లోనే ఉంది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్‌ లైన్‌లో వెళ్లేలా సిగ్నల్‌ సక్రమంగానే ఉంది. కోరమాండల్‌కు మెయిన్‌లైన్‌కు సిగ్నల్‌ ఉండగా... లూప్‌లైన్‌లోకి ఎలా వెళ్లిందనేదే ప్రశ్న! విశ్వసనీయ సమాచారం ప్రకారం... పారాదీప్‌ నుంచి మెయిన్‌లైన్‌లో వెళ్తున్న ఒక గూడ్స్‌ను కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు దారి ఇవ్వడం కోసం బహనాగ్‌బజార్‌ స్టేషన్‌ వద్ద లూప్‌లైన్‌లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ‘లూప్‌లైన్‌’ను రెడ్‌లో ఉంచి... కోరమాండల్‌కు మెయిన్‌లైన్‌లో సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ప్రక్రియను ‘త్రూ లైన్‌’ అంటారు. (తొలుత గూడ్స్‌కు మెయిన్‌లైన్‌లో ఇచ్చిన రెడ్‌ సిగ్నల్‌ను తీసేసి... తర్వాత వచ్చే కోరమాండల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం. దీనినే...సిగ్నల్‌ గివెన్‌ అండ్‌ టేకెన్‌ ఆఫ్‌ అంటారు.) ఇలా సిగ్నల్‌ ఇచ్చినప్పుడు పట్టాలదగ్గర ఉన్న ‘పాయింట్‌’ మారిపోవాలి. (కదులుతున్న రైలును ఒక ట్రాక్‌ నుంచి మరో ట్రాక్‌పైకి మళ్లించడాన్నే ‘పాయింట్‌’ అంటారు.) కోరమాండల్‌ మెయిన్‌లైన్‌లో వెళ్లేలా ‘త్రూ’ కావాలి. కానీ... అలా జరగలేదు. సిగ్నల్‌ – పాయింట్‌ మధ్య లోపం తలెత్తింది. సిగ్నల్‌ బాగుంది కానీ... పాయింట్‌ మారకపోవడంతో, అప్పటికే గూడ్స్‌ వెళ్లిన లూప్‌లైన్‌లోకే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా వెళ్లింది. బహనాగ్‌బజార్‌ రైల్వే స్టేషన్‌లోని డిజిటల్‌ సిగ్నల్‌ చార్ట్‌లో ఇదంతా నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. సిగ్నల్‌ ఇచ్చినా పాయింట్‌ ఎందుకు మారలేదనేదే ఇక్కడ ప్రశ్న! గతంలో పాయింట్‌ మార్చేందుకు రైల్వే సిబ్బంది లివర్‌ లాగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరంలేదు. స్టేషన్‌ మాస్టర్‌ తన గదిలో కూర్చుని కంప్యూటర్‌పై మౌస్‌తో క్లిక్‌ చేస్తే... మోటర్‌ ఆన్‌ అయి, పాయింట్‌ను పుష్‌ చేస్తుంది. మరి... ఇక్కడ పాయింట్‌ ఎందుకు మారలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం విషయంలో డ్రైవర్‌ (పైలట్‌) పాత్రపైనా చర్చ జరుగుతోంది. గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ముందుకు వెళ్లడం.. రెడ్‌ వస్తే ఆపడం.. నిర్దేశిత/సూచిత వేగంతో బండి నడపడం మాత్రమే పైలట్‌ పని. సిగ్నల్‌ ఇవ్వడం, పాయింట్‌ మార్చే బాధ్యత స్టేషన్‌ మాస్టర్‌దే. .

చక్రాలు బాగున్నాయా? ఇప్పుడు రైల్వేలో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక వ్యవస్థలో... ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడమనేది జరగనే జరగదని ఒక నిపుణుడు తెలిపారు. రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ చాలా పకడ్బందీగా పని చేస్తుందని... ఒకటికంటే ఎక్కువ దశల్లో తప్పిదాలుచేస్తేనే ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వెరసి... కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడమే ఈ ప్రమాదానికి కారణం కావచ్చునని అంచనా వేశారు. చక్రాలు విఫలం కావడం, విరిగిపోవడం వల్ల రైలు పట్టాలు తప్పే అవకాశముంటుంది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ ప్రయాణికుల జంట చెప్పిన దాని ప్రకారం వారు ప్రయాణిస్తున్న బోగీ వెనుక ఉన్న మరో బోగీవీల్స్‌ విరిగిపోయి ఉన్నాయి

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :