Famous TV - జాతీయ వార్తలు / : ఓటర్ లిస్ట్ తయారు అయిపోయినా కూడా, ఎలక్షన్స్ నామినేషన్స్ ఫైల్ చేసే చివరి రోజుకు 10 వర్కింగ్ డేస్ ముందు వరకు కూడా మనం ఓటు నమోదుకు అప్లై చేసుకోవచ్చు అనే విషయం అందరూ తెలుసుకోవాలి అయినప్పటికీ అంతవరకూ కాకుండా ముందే నమోదు చేయించుకోవడం చాలా చాలా మంచిది నివాస డోర్ నెంబర్లు మాత్రమే ఓటర్ లిస్టులో పేర్లు నమోదు చేయడానికి పరిగణలోకి తీసుకోవాలి షాపులు, పరిశ్రమలు, స్కూళ్లు తదితర వాణిజ్య సంస్థల డోర్ నంబర్స్ తో ఓటర్ల నమోదు చేయరాదు 0 (Zero) 00 (Zero Zero) etc. లాంటి డోర్ నెంబర్ల తో ఓటర్ల నమోదు చేయకూడదు ఒక డోర్ నెంబర్ ఓట్లు ఒక బూత్ లోనే ఉండాలి, వేరు వేరు పోలింగ్ బూతుల్లో చేర్చ రాదు ఒక ఇంటి డోర్ నెంబర్ మీద ఉన్న అందరి ఓట్లు వరుస క్రమంలో one by one సీరియల్ గా ఉండాలి ఒక ఇంటి డోర్ నెంబర్ పై మొత్తంగా ఎన్ని ఓట్లు ఉండాలి అనే విషయంలో ప్రస్తుతానికి ఖచ్చితమైన నిబంధనలు లేవు అయితే 10 మించి ఓట్లు ఒకే డోర్ నెంబర్ లో ఉంటే మరింత క్షుణ్ణంగా అధికారులు తనిఖీ చేస్తున్నారు అధికారులు ఓటర్ల నమోదు (ఫారం-6), తొలగింపు (ఫారం-7) సమయంలో పూర్తి నిబంధనలు పాటించాలి. అలా చేయని పక్షంలో వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు https://electoralsearch.eci.gov.in/ సైట్ లోకి వెళ్లి, మీ VOTER ID (EPIC No) మరియు స్టేట్ Name ఎంటర్ చేసి మీ ఓటు వివరాలు అనగా అసెంబ్లీ constituency పేరు, బూత్ నంబర్, ఓటు సీరియల్ నెంబర్, బూత్ లెవెల్ ఆఫీసర్ పేరు, అతని ఫోన్ నెంబర్ etc. చూసుకోవచ్చు వివరాలు స్క్రీన్ షాట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకుని ఒకవేళ మీ ఓటు అక్రమంగా తొలగిస్తే సంబంధిత అధికారుల పై వెంటనే ఫిర్యాదు చేయవచ్చు ఇప్పడే నా వోట్ ఉందా లేదా అని చెక్ చేశా నాది అయితే ఉంది మరి మీది ? మీకు ఎలా వెతకాలో తెలియకపోతే కింద వీడియో ఫాలోఅవ్వండి https://electoralsearch.eci.gov.in
Admin
Famous TV