Famous TV - జాతీయ వార్తలు / : ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఎన్నికల కమిషనర్ల నియామకం, పదవీకాలం, జీతం మరియు ఇతర సేవా షరతులు వంటి వివిధ అంశాలతో సర్వీస్ నిభందనలను లోకసభ ఆమోదించింది ,కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధివిధానాల బిల్లుపై జరిగిన చర్చలో పాల్కొన్న గల్లా జయదేవ్.ఈ బిల్లులను ఆమోదించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకులూ మరియు గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ మద్దతు తెలియచేసారు , ఆర్టికల్ 324 ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించడానికి, సుప్రీం కోర్టు తొలగింపుకు సూచించిన అదే విధానాన్ని అనుసరించాలి.కానీ నా విన్నపం నీ మీ ద్రుస్తికి తీసుకుని వస్తున్నాను ఎన్నికల కమీషనర్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించడాన్ని కూడా మనం పరిగణించగలిగితే ఎన్నికల సంఘం యొక్క గౌరవాన్ని పెంచేలావుంటుంది ఆ దిశగా న్యాయశాఖ మంత్రిగారు దీనిని పరిశీలించగలరు.అని ఎంపీ జయదేవ్ అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లలో జాబితా అక్రమాలు, దొంగ ఓట్ల వ్యవహారంపై పార్లమెంటులో ప్రస్తావించిన తెదేపా ఎంపి గల్లా జయదేవ్. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదని పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం ఎన్నికల సంఘం ప్రధాన విధి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఆ విధమైన పరిస్థితి కనిపించడం లేదు.క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించే విషయంలో ఈసి ఇచ్చిన ఆదేశాలను డిఆర్‌ఓలు, స్థానిక సిబ్బంది ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఒత్తిడిడులకు లొంగి వారికి అనుకూలంగా జాబితాలో మార్పులు చేస్తున్నారు,ఇదే విషయంపై మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో ఎన్నికల సంఘాన్ని కలిసి పిర్యాదు కూడా చేశారు. ఓటర్ల జాబితా నుంచి టిడిపి సానుభూతి పరులు, కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారని ఈసి పిర్యాదులు స్పష్టమైన ఆధారాలతో వివరించారు. ఎపిలో జరుగుతున్న ఎన్నికల అక్రమాలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. వెంటనే స్థానికులతో సంబంధం లేని అధికారుల పర్యవేక్షణలో ఓటర్ల జాబితా రూపొందించేందుకు దృష్టి సారించాలి. ఎపిలో స్థానికేతర అధికారుల పర్యవేక్షణలో ఓటర్ల జాబితా రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయంటే... కింది స్థాయి అధికారులపైకి నెపం నెట్టేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకుంటున్నారు.కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు.సుమారు 10 లక్షల పిర్యాదులు చేసినా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. తుది ముసాయిదా జాబితా విడుదల చేసిన సందర్భంలో 13 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించినట్లు ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. దొంగ ఓట్లు ఉన్నాయని అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా. అందుకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించే చర్యలు చేపట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అని మీ ద్వ్రరా కేంద్ర న్యాయశాఖ మంత్రిగారిని కోరుతున్నాను .
Admin
Famous TV