Sunday, 13 September 2026 03:53:54 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఒడిశా రైలు ప్రమాదంపై నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం తీవ్ర దిగ్భ్రాంతి

03.06.2023::చిలకలూరిపేట

Date : 03 June 2023 11:36 AM Views : 514

Famous TV - జాతీయ వార్తలు / : ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని,400 మంది తీవ్రంగా గాయపడ్డారు అని,900 మందికిగాయాలయ్యాయి అని వచ్చిన తాజా సమాచారం బాధాకరమని రావుసుబ్రహ్మణ్యం అన్నారు.తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.రైల్వే అధికారులతో చర్చించి బాధితులకు న్యాయం చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించాలని నవతరంపార్టీ నుండి కోరుతున్నామన్నారు.రైల్వే అధికారులనుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలని తగిన సహాయకచర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయకచర్యలు చేపట్టి నష్ట నివారణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. నవతరంపార్టీ చిలకలూరిపేట కార్యాలయం నుండి ఈమేరకు ప్రకటన విడుదల చేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :