Monday, 14 September 2026 05:26:56 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

తుంగభద్రకు జలకళ

వరదనీటి రాకతో నిండుకుండలా జలాశయం

Date : 15 July 2023 10:50 AM Views : 486

Famous TV - జాతీయ వార్తలు / : తుంగభద్ర జలాశయానికి రోజురోజుకు వరద నీరు చేరిక పెరగుతుండడంతో జలకళ సంతరించుకుంది. గత వారం వరకు డెడ్‌ స్టోరేజ్‌తో కళతప్పిన తుంగభద్ర జలాశయానికి ఇపుడిపుడే వరద నీరువచ్చి చేరుతుండంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. జలాశయం పైభాగం ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పై భాగంలోని తుంగ, భద్ర జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఈ రెండు జలాశయాల నుంచి దిగువకు నీరు వదులుతుండడంతో తుంగభద్రకు రోజు రోజుకు వరద నీటి చేరిక పెరుగుతోంది. ప్రస్తుతం జలాయశానికి 15,800 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు జలాశయం అధికారులు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 3.91 టీఎంసీలు నీరు చేరింది. ప్రస్తుతం జలాశయంలో 6.98 టీఎంసీ నీరు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో భద్రతా దృష్ట్యా దిగువకు వరద నీటిని వదిలారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడం ప్రారంభించడంతో జలాశయానికి నీటి చేరిక ఆలస్యంగా జరుగుతోందని తుంగభద్ర బోర్డు అధికారులు చెబుతున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :