Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : మారణహోమం ఆపాలని,శాంతినెలకొల్పాలని ఆదిశగా ప్రభుత్వ చర్యలుండాలని నినదిస్తూ మణిపూర్ భాదితుల సంఘిభావకమిటీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ NGO సంఘాలనాయకులు పాల్గొని ప్రసంగించారు.మణిపూర్ లోని రెండు తేగల మధ్య ఘర్షణగా పైకి కనిపిస్తున్నా దీని వెనక అత్యంత విలువైన అటవీ సంపద కొల్లగొట్టాలనే కుట్ర కనిపిస్తోందన్నారు.అది ఏస్థాయికెళ్ళిందంటే సమాజంలో అత్యంత హేయమైన,మానవత్వం మరిచి,తలకెక్కిన మతోన్మాదం మహిళల్ని నగ్నంగా ఊరేగించి అడ్డొచ్చిన వారినంతం చేసే స్థాయికొచ్చింది. మూడు నెలలుగా... మణిపూర్ లో జాతి దురహంకార హంతక మూకలు యథేచ్ఛగా కుకీ ప్రజలపై హత్యాకాండ, అత్యాతారాలూ ,గృహదహనాలూ సాగిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తూనే ఉన్నారు. రెండు నెలలుగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి అల్లర్లను, ఘోర హత్యాకాండనూ , మహిళలపై సాగుతున్న అత్యాచారాలనూ లోకానికి తెలియకుండా చేశారు. ఒక కుకీ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ ఆమె శరీరంతో ఆడుకుంటూ హంతకమూక రెచ్చిపోయిన దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరు నిర్ఘాంతపోయారు. ప్రపంచం మానవాళి ఖండించింది. ఇక మౌనం వీడాలి.
మణిపూర్ మంటలాగాలి--శాంతి నెలకొనాలి. పాశవిక దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలి. ఇకపై ఎటువంటి దాడులు జరగకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలి! భాదితులకు ధైర్యాన్ని ఇచ్చేవిధంగా గట్టి భరోసా ఇచ్చే విధంగా ప్రధాని,మణిపూర్ ముఖ్యమంత్రి మోనం వీడి ప్రతిపక్షాలను కలుపుకుని మణిపూర్ సందర్శించి శాంతి ప్రదర్శన చేయాలి అని ఈ శాంతి ర్యాలీలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ మల్లారపు నాగార్జున,టెంకాయల దామోదరం,O.వెంకటరమణ,సాయిలక్ష్మి (సాహితీస్రవంతి)ఐద్వా జయంతి,కిరణ్ కుమారి(ఆర్టిస్ట్ )గాయకులు డా కడివేటి మునిరత్నం,సంబోల్ హరినాథ్ ,బాలాజి (యూనివర్సిటీ) నడ్డినారాయణ,సుంకర రెడ్డెప్ప,మునిరామయ్య తిరుపతి బాలోత్సవo సాకం నాగరాజు,నెమలేటి కిట్టన్న (అరసం), ప్రసాదరావు ,వెంకటేశం ,కొమ్మారెడ్డెప్ప ,రవికుమార్ ,రామకృష్ణ ,మోహనమూర్తి ,భాస్కర్ నాయక్ ,చంద్రానాయక్ (టీటీడీ నాయకులు) రాజకుమార్(రోటరీ) ముత్యాలరెడ్డి,D.నిర్మల Aపద్మజ,మధుసూదన్ రెడ్డి,దండు రామచంద్రయ్య (UTF),,డా"శ్రీధర్ విటలం,మునిలక్ష్మి ,రత్నశేఖర్ (IMPACT),తహసీనా (we support చారిటబుల్ ట్రస్ట్) డా"C శ్రీరాములు,T గోపాల్ పైడి అంకయ్య(వే ఫౌండేషన్) తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV