Famous TV - జాతీయ వార్తలు / : తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖామాత్యులు పీయూష్ గోయల్ గారితో సదరు మంత్రిత్వ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో తిరుపతి కాటన్ మిల్లుతో పాటుగా హస్తకళల సేవా కేంద్రం ఏర్పాటు గూర్చి చర్చించారు. గతంలో జౌళి మంత్రిత్వ శాఖ కాటన్ మిల్లు పునరుద్ధరణ గూర్చి సమాధానం ఇస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖకి సంబందించిన నీతీ ఆయోగ్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగంతో సంప్రదించి పునరుద్దరణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలియజేసారని అందుకు సంబందించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఆయనకి చూపిస్తూ దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న సుమారు 1000 కుటుంబాలకు ఈ మిల్లు జీవనోపాధిని కల్పిస్తున్నదని దయచేసి మిల్లు పునరుద్దరణకు సహకరించాలని కోరగా అనంతరం నీతీ ఆయోగ్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ నుండి సమాధానం వచ్చిన పిదప దేశం లోని మొత్తం 23 కాటన్ మిల్లుల గూర్చి నిర్ణయం తీసుకొంటామని ఉద్యోగులకి పెండింగ్ లో ఉన్న జీతాలని కూడా ఇస్తామని చెప్పారని ఎంపీ తెలియజేసారు. అలాగే తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో కలంకారీ వంటి పురాతన ప్రసిద్ధ హస్తకళలను ప్రోత్సహించడం కోసం తిరుపతిలో హస్తకళల సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని, హస్తకళలు మార్కెట్ చేసేందుకు తిరుపతిలో మంచి అవకాశం ఉన్నందున ప్రాధాన్యతా ప్రాతిపదికన తమ ప్రతిపాదనలను పరిశీలించవలసిందిగా ఆయనను కోరగా సూనుకూలంగా స్పందించారని పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని తెలియజేసారు.
Admin
Famous TV