Thursday, 30 July 2026 10:14:56 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నేడు హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ ప్రారంభం

టికెట్ ధరలు, టైమింగ్స్, ఆగే స్టేషన్లు ఇవే

Date : 25 September 2023 10:46 AM Views : 563

Famous TV - జాతీయ వార్తలు / : కాచిగూడ - యశ్వంత్‌పూర్ వందేభారత్ రైలు ప్రారంభం. వివరాలివే హైదరాబాద్- బెంగళూరు మధ్య ప్రయాణాలు సాగించే వారికి గుడ్‌న్యూస్. నేడు ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ ట్రైన్ ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ఇవాళ ఒకేసారి 9 వందే భారత్ ఎక్స్‌ప్రైస్ ట్రైన్లను వర్చువల్‌గా ప్రారంభిస్తుండగా. అందులో కాచిగూడ (హైదరాబాద్)- యశ్వంత్‌పుర్ (బెంగళూరు) ట్రైన్ కూడా ఉంది. ఈ ట్రైన్ ఏపీ మీదుగా కర్ణాటకకు వెళ్లనుంది. అంటే మూడు రాష్ట్రాలను ఈ ట్రైన్ కలపనుంది. నేడు ప్రారంభం కానున్న ట్రైన్. రేపటి నుంచి (సెప్టెంబర్ 25) ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.కాచిగూడ-యశ్వంత్‌పుర్‌ వందేభారత్‌లో 8 కోచ్‌లు ఉంటాయి. రైలులో 530 మంది ప్రయాణించేందుకు సీట్లున్నాయి. టికెట్ల బుకింగ్‌ సదుపాయం ప్రారంభం కాగా.. ఒక ప్రయాణికుడికి క్యాటరింగ్‌ ఛార్జీలతో కలిపి- ఏసీ ఛైర్‌కార్‌ ధర రూ.1,600గా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్‌ టికెట్‌ ధర రూ.2,915 గా ఉంది. క్యాటరింగ్‌ వద్దనుకుంటే ఏసీ ఛైర్‌ కార్‌ టికెట్‌ రూ.1,255, ఎగ్జిక్యూటివ్‌ టికెట్‌ రూ.2,515గా నిర్ణయించారు.కాచిగూడ - యశ్వంత్‌పూర్ వందేభారత్ రైలు ప్రారంభం.. వివరాలివే హైదరాబాద్- బెంగళూరు మధ్య ప్రయాణాలు సాగించేవారికి గుడ్‌న్యూస్. నేడు ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ ట్రైన్ ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ఇవాళ ఒకేసారి 9 వందే భారత్ ఎక్స్‌ప్రైస్ ట్రైన్లను వర్చువల్‌గా ప్రారంభిస్తుండగా.. అందులో కాచిగూడ (హైదరాబాద్)- యశ్వంత్‌పుర్ (బెంగళూరు) ట్రైన్ కూడా ఉంది. ఈ ట్రైన్ ఏపీ మీదుగా కర్ణాటకకు వెళ్లనుంది. అంటే మూడు రాష్ట్రాలను ఈ ట్రైన్ కలపనుంది. నేడు ప్రారంభం కానున్న ట్రైన్.. రేపటి నుంచి (సెప్టెంబర్ 25) ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్‌పుర్‌ వందేభారత్‌లో 8 కోచ్‌లు ఉంటాయి. రైలులో 530 మంది ప్రయాణించేందుకు సీట్లున్నాయి. టికెట్ల బుకింగ్‌ సదుపాయం ప్రారంభం కాగా.. ఒక ప్రయాణికుడికి క్యాటరింగ్‌ ఛార్జీలతో కలిపి- ఏసీ ఛైర్‌కార్‌ ధర రూ.1,600గా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్‌ టికెట్‌ ధర రూ.2,915 గా ఉంది. క్యాటరింగ్‌ వద్దనుకుంటే ఏసీ ఛైర్‌ కార్‌ టికెట్‌ రూ.1,255, ఎగ్జిక్యూటివ్‌ టికెట్‌ రూ.2,515గా నిర్ణయించారు. ఈ రెండు నగరాల మధ్యదూరం 610 కి.మీ దూరం కాగా ప్రయాణానికి 8.30 గంటల సమయం పడుతుంది. కాచిగూడ-యశ్వంత్‌పుర్‌ వందేభారత్‌ మార్గం మధ్యలో నాలుగు స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడలో ఉదయం 5.30కి ట్రైన్ బయల్దేరుతుంది. మహబూబ్‌నగర్‌ 6.49 గంటలకు, కర్నూలు 8.24 గంటలకు, అనంతపురం 10.44 గంటలకు, ధర్మవరం 11.14 గంటలకు, యశ్వంత్‌పుర్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. బుధవారం మినహా వారంలో 6 రోజులు ఈ వందేభారత్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. సెలవు రోజును రైలు నిర్వహణకు వినియోగిస్తారు. కాచిగూడ స్టేషన్‌లో జరిగే ట్రైన్ ప్రారంభం కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులకు ఆహ్వానాలు పంపినట్లు రైల్వే అధికారులు తెలిపారు.ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రెండు వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి మధ్య ట్రైన్లు నడుస్తున్నాయి. వీటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఐటీ సిటీలుగా పేరొందిన బెంగళూరు, హైదరాబాద్ మధ్య చాలా మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ నగరాల మధ్య ట్రైన్ నడిపేందుకు రైల్వేశాఖ రెడీ అయింది. కాగా, ఇవాళ విజయవాడ- చెన్నై మధ్య కూడా మరో ట్రైన్ ప్రారంభం కానుంది. దీంతో ఏపీలో మెుత్తం నాలుగు వందే భారత్ ట్రైన్లు పరుగులు పెట్టనున్నాయి.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :