Famous TV - జాతీయ వార్తలు / Hyderabad : తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఉత్తమ జాతీయ పి ఆర్ అకడమిక్ కౌన్సిలర్ అవార్డు (2024) స్వీకరించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని హోటల్ టూరిజం ప్లాజాలో జాతీయ పబ్లిక్ రిలేషన్స్ విద్యా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణా నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మీడియా అకాడెమీ చైర్మన్ కె శ్రీనివాసులు రెడ్డి ఆయనకు అవార్డు అందించారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, డాక్టర్ సి వి నరసింహ రెడ్డి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో అవార్డు ఇచ్చారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తిరుపతి కేంద్రంలో ఆయన 20 ఏళ్లకు పైగా పబ్లిక్ రిలేషన్స్ పాఠాలు చెప్పినందుకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ కన్సార్టియం ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ భూషణ్ నడ్డా, పి ఆర్ ఎస్ ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ పాతక్, పి ఆర్ వాయిస్ ఎడిటర్ వై బాబ్జీ, పి ఆర్ ఎస్ ఐ జాతీయ ఉపాధ్యక్షుడు యు ఎస్ శర్మ, హైదరాబాబ్ చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ రాము కార్యదర్శి, కె యాదగిరి, సివియన్ పి ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సి రమా దేవి, కార్యదర్శి సి రవీందర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.
Reporter
Famous TV