Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పేరుతో జరుగుతున్న మానవ కార్యకలాపాలు పర్యావరణాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయి ఫలితంగా వాతావరణం లో వస్తున్న తీవ్ర మార్పులు మానవ మనుగడకు ముప్పుగా పరిణమించాయి. మానవాళితోపాటు జీవరాశులు మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకము దీనికి ప్రాధాన్యమిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ పరిరక్షణ దినముగా ప్రకటించింది ఆ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతిలోని అటవీ శాఖ అధికారులతొ పాటు సేరికల్చర్ డిపార్ట్మెంట్ పర్యావరణ మిత్రులు ,ఇతర స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో బీట్ ఎగైనెస్ట్ ప్లాస్టిక్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది
ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, 2023న ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రభుత్వం, రాష్ట్ర సిల్వికల్చర్ బయోట్రిమ్. యశోదా భాయ్ ఆధ్వర్యంలో తిరుపతిలో ప్లాస్టిక్ క్లీన్ అప్ డ్రైవ్ నిర్వహించారు. బర్డ్‌మ్యాన్ కార్తీక్ వన్యప్రాణి పరిశోధకుడు మరియు వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ మరియు వే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. పైడి అంకయ్య, ఆర్. జె. యూ. పి రాష్ట్ర అధ్యక్షులు టి. గోపాల్, తిరుపతి సేవ్ సాయిల్ వాలంటీర్లు మరియు APNGC కో ఆర్డినేటర్ నీలకంటయ్య, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ngos ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
Admin
Famous TV