Monday, 14 September 2026 06:57:54 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్ సర్వీస్

Date : 11 June 2023 09:55 AM Views : 455

Famous TV - జాతీయ వార్తలు / : బెంగళూరు:జూన్ 10 తిరుమల తీర్థయాత్రను సులభతరం చేయడానికి కొత్తగా బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు, ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం నుండి తిరుపతికి హెలికాప్టర్ ఈ సేవలను అందిస్తోంది. ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో హెలికాప్టర్ బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుండి 4.15 గంటల మధ్యలో తిరుపతి నుండి బెంగళూరుకు బయలుదేరవచ్చు. తిరుపతికి బయలుదేరే హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణించడానికి అవకాశం ఉంది. హెలికాప్టర్ రైడ్ బెంగళూరు-తిరుపతి నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. బెంగళూరు నుండి తిరుపతికి సుమారు నాలుగు గంటల నుంచి ఐదు గంటల ప్రయాణించడానికి సమయం పడుతుంది. హెలికాప్టర్ సేవతో తిరుమల వెళ్లే భక్తులు దాదాపు 1. 5 గంటల్లో తిరుపతి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు అంటున్నారు. తరువాత తిరుపతి నుంచి తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్‌లో ప్రయాణించాలంటే జీఎస్టీ మినహా దాదాపు రూ.3, 50, 000 ఖర్చు అవుతుంది. రూ. 3, 50, 000 నుండి పూర్తి హెలికాప్టర్ అందుబాటులో ఉంది. రూ. 3. 50, 000 లక్షలకు ఒకేసారి ఐదుగురు ప్రయాణికులు వెళ్లవచ్చు. ఒంటరిగా వెళుతున్నప్పటికీ మీరు ఈ ప్రైవేట్ హెలికాప్టర్ పొందవచ్చు. ఫ్లైబ్లేడ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా బుకింగ్‌లు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. వెబ్‌సైట్‌లో లేదా 1800-102-5233లో బుకింగ్‌లు చేయవచ్చు. బుకింగ్‌లు కనీసం 24 గంటల ముందుగానే చేయాలి. దేశవ్యాప్తంగా యాత్రికులు తిరుపతి నగరానికి చేరుకుని తరువాత తిరుమల వెళ్లడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతిలోని విమానాశ్రయానికి రేణిగుంట విమానాశ్రయం కు చాలా మంది చేరుకుని తరువాత తిరుమల వెలుతున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :