Monday, 14 September 2026 06:14:48 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ప్రతి ఒక్క వైద్యుడు పేద రోగులకు వైద్యం అందించాలి

Date : 14 September 2024 08:15 PM Views : 706

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : ఎస్వీ వైద్య కళాశాల భువన విజయం ఆడిటోరియం నందు కాలేజ్ డే ఘనంగా నిర్వహించారు. అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో జరిగింది. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా విచ్చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీ వైద్య కళాశాల విచ్చేసిన సందర్భంగా నాకు నేను నా ఎం.బీ.బీఎస్,చదువుకున్న రోజుల గుర్తుకొస్తున్నాయి అని అన్నారు. ప్రతి ఒక్క వైద్యుడు పేద రోగులకు వైద్యం అందించాలని, గ్రామీణ ప్రాంతంలో కొంతకాలం పనిచేసే అనుభవం తెచ్చుకొని పీజీ వైద్య విద్య చేరినట్లయితే ఇంకా మెరుగైన వైద్యం అందించవచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే ఎస్వీ వైద్య కళాశాల పరిశోధనలో ముందడుగు వేయడం ఎంతో సంతోషంగా ఉందని, వైద్య పరిశోధనల్లో ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాలలో పోటీపడి పరిశోధనలలో చొచ్చుకపోవడం, తిరుపతి ఎస్ వి వైద్య కళాశాలకు ఎంతో తోడ్పాటున అందిస్తుందని, వైద్య విద్యార్థులకు, రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో , ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇతర దేశాలతో పోటీపడివైద్యంలో మనం మెరుగైనవైద్యం అందించబోతున్నామని, ఈ సందర్భంగా తెలపడానికి చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. భారత ప్రధాని చెప్పినట్లు వైద్యరంగంలోన మార్పులు రాబోతున్నాయని, ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నారు అని ఆయన అన్నారు. వైద్యం ఒకటే కాకుండా చదువుకున్న రోజుల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఒత్తిడి, గురికాకుండా చదువుకోవాలని వైద్య విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు. *మరుగైన వైద్య విద్యను నేర్చుకోండి పేద రోగులకు మెరుగైన వైద్యం అందించండి* ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, ప్రసూతి ఆసుపత్రి డాక్టర్ పార్థసారధిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ సునీత, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ మాధవి లత, అన్ని విభాగాధిపతులు, యు జి. వైద్య విద్యార్థులు, వైద్య కళాశాల సిబ్బంది, మరియు పి.ఆర్ఓ. వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :