Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : శ్రీనివాస్ రామానుజన్ గారి జన్మదినం సందర్భంగా JCI తిరుపతి ఒడిస్సీ తిరుపతిలోని MJPAPBCBCWR పాఠశాల నందు 500 మందికి గణిత అష్టావధానం చేయడం జరిగింది.అవధాని గౌ||హసనాపురం అరుణ శివప్రసాద్ గారిచే మరియు 8 మంది పృచ్ఛకులచే ప్రశ్నలు అడిగించడం పిల్లలకు ఎంతో సంతోషం కలిగించింది. కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతంలోనే గణిత అష్టావధానం మీద ఎన్నో అవధానాలు చేసినటువంటి హసనాపురం అరుణ శివప్రసాద్ గారు,JCI TIRUPATI ODYSSEY PRESIDENT నెల్లూరు మునిలక్ష్మి గారు,పాఠశాల ప్రిన్సిపాల్ మహేశ్వరి గారు, నడ్డి నారాయణగారు, JCI తిరుపతి ఒడిస్సీ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ నీరజ గారు, JCI ట్రెసరర్ హేమప్రియ గారు, JC డాక్టర్ శ్రీధర విట్టలం గారు , చెస్ బాలాజీ చౌదరి గారు ,జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు బిర్లనాయుడు గారు, రెడ్డప్ప గారు, పాఠశాల యాజమాన్యం పాల్గొని పిల్లలకందరికీ మరింత ఉత్తేజాన్ని కలిగించడం జరిగింది. పిల్లలకు గణితం పట్ల మరింత ఆసక్తి కలిగేవిధంగా పిల్లలందరినీ కూడా చాలా సులభమైన పద్ధతిలో గణితం నేర్చుకోవడానికి సూచనలు ఇవ్వడం జరిగింది.
Admin
Famous TV