Wednesday, 29 July 2026 02:02:09 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

Date : 17 November 2025 08:07 PM Views : 702

Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టీవీ చిత్తూరు జిల్లాలో 27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీవోలకు సోమవారం ఓ ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు. ప్రకటనలోని సారాంశం క్రింది విధంగా ఉన్నది.జిల్లాలో మొత్తం 612 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో పనిచేయవలసిన సిబ్బంది సంఖ్య 4,477 ఉండగా, ప్రస్తుతం 4,040 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.మిగిలిన 437 మంది విధులకు హాజరు కావడం లేదని ఎంపిడిఓలు మరియు మున్సిపల్ కమిషనర్లు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తెలియజేశారు.ఈ 437 మందిలో 152 మంది మెడికల్ లీవ్‌లో ఉన్నారు, 251 మంది వివిధ శాఖల్లో డెప్యుటేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు, 27 మంది అనధికారిక సెలవులో ఉన్నారు.దీనిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.సచివాలయ సిబ్బంది సచివాలయంలోనే విధులు నిర్వహించాల్సిన పరిస్థితిలో, అనధికారికంగా సెలవులు తీసుకోవడం సరికాదని పేర్కొంటూ,వీరి పై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.దీననుసరించి, అనధికారిక సెలవులో ఉన్న 27 మంది సిబ్బందిపై క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా, మెడికల్ లీవ్‌లో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డుకు పంపించి పరీక్షలు నిర్వహించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.అందువల్ల, అందరూ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లు ప్రస్తుతం సెలవులో ఉన్న సిబ్బంది వెంటనే విధులకు హాజరుకావాలని వారికి సూచించాలని ఆదేశించబడింది. ఇందులో ఏ విధమైన ఆలస్యం జరిగినా, సంబంధిత వారిపై కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :