Monday, 14 September 2026 06:14:09 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

యశస్వి టెస్ట్ ద్వారా రూ. 2.50 లక్షల వరకు స్కాలర్ షిప్‌

సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సురేష్ నాయుడు పిలుపు

Date : 30 July 2023 02:42 PM Views : 588

Famous TV - విద్య ఉద్యోగాలు / : కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యశస్వి టాలెంట్ టెస్ట్‌ను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సహజ సంపద సంస్థ వ్యవస్థాపకులు పోచినేని సురేష్ నాయుడు పిలుపు నిచ్చారు. వరదయ్యపాళెంలోని డైనమిక్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రతిభావంతులైన పేద విద్యార్థులను గుర్తించి, వారి చదువులను ప్రోత్సహించడం కోసం ఈ పరీక్షను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. ఈ పరీక్షల ద్వారా దేశ వ్యాప్తంగా 30,000 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎం. పిక చేసి రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్పులు అందించనుందన్నారు. 9వ తరగతి వారికి రూ. 75,000, 11వ తరగతి చదివే వారికి రూ. 1,25,000 చొప్పున ఏటా స్కాలర్ షిప్ అందించనుందని తెలిపారు. సెప్టెంబర్ 29న జరిగే ఈ పరీక్ష కోసం ఆగస్టు 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, ఆ తర్వాత మార్పులు, చేర్పులను 16వ తేదీ వరకు అనుమతిస్తారని వెల్లడించారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష ఉంటుందన్నారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తుండగా, ఇందులో మ్యాథ్స్ కు సంబంధించి 30, జనరల్ నాలెడ్జ్ కు సంబంధించి 20, సైన్స్, సోషల్ సైన్స్ కు సంబంధించి 25 చొప్పున మార్కులకు ప్రశ్నలుంటాయన్నారు. తప్పు సమాధానాలు రాసినా నెగటివ్ మార్కులు లేవని, అలాగే ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదన్నారు. వార్షికాదాయం రూ. 2.5 లక్షలకు మించని ఓబీసి, ఇబీసి, డీనోటిఫైడ్, సంచార జాతుల పిల్లలకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. దరఖాస్తుతో పాటు మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు, ఆధార్ కార్డ్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను సమర్పించాలని వెల్లడించారు. https://yet.nta.ac.in లో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. దీనికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే తమను 9000487879 నెంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: