Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : స్థానిక బైరాగి పట్టెడలోని మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్లో నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమం వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు ఏ మురుగన్ గారి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి వే ఫౌండేషన్ అధ్యక్షులు పి అంకయ్య గారు ముఖ్యఅతిథిగా విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ సి శ్రీరాములు గారు, విశ్రాంత సాంస్క్రిట్ ప్రొఫెసర్ సింగంశెట్టి సుబ్బరాయుడు గారు హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏ మురుగన్ గారు మాట్లాడుతూ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో నల్ల జాతి ప్రజల కోసం ఎన్నో ఏండ్లు జైల్లో అనేక బాధలు అనుభవించి చివరకు దక్షిణాఫ్రికా అధ్యక్షు లు గా ఎన్నికయి వారి దేశ అభివృద్ధికి కృషిచేసి న గొప్ప వ్యక్తిని తెలియజేశారు. విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ సి శ్రీరాములు గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాన్ని నమ్మి అదే బాటలో పైనుంచి దక్షిణాఫ్రికా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మండే సూర్యుడని, విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి పౌరులు ఎదగాలని తెలిపారు. వే ఫౌండేషన్ అధ్యక్షులు పి అంకయ్య గారు మాట్లాడుతూ నెల్సన్ మండేలా మహోన్నతమైన గొప్ప వ్యక్తిత్వం గల మనిషిని, అనుకున్నది సాధించే వరకు పోరాడి వారి దేశ ప్రజలకు ఆకాంక్షలు నెరవేర్చారని, వారి పడిన శ్రమ వృధా కాలేదని తెలియజేస్తూ విద్యార్థుల విద్యా రంగంలో ఇష్టంగా కష్టపడి ఉన్నత స్థానాలు చేరుకోవాలని కోరారు. అంతకుముందు నెల్సన్ మండేలా జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు, ఎలోక్యూషన్ పోటీలు నిర్వహించి విజేతల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ బోర్డు సభ్యులు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రెడ్డప్ప గారు, విశ్రాంత సాంస్క్రిట్ ప్రొఫెసర్ సింగంశెట్టి సుబ్బరాయుడు గారు, డాక్టర్ సి శ్రీరాములు గారు, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV