Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : 25.07.2023, తిరుపతి ఎస్ వి వైద్య కళాశాల,మంగళవారం ఎస్ వి వైద్య కళాశాలలో 64వ వ్యవస్థాపక దినం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎస్ వి.వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 1964 వ సంవత్సర ఎస్ వి వైద్య కళాశాల మొదటి బ్యాచ్ వైద్యులు అపూర్వకలైక . ఎస్వీ వైద్య కళాశాలలో 1964 మొదటి బ్యాచ్ వైద్య విద్యార్థు లు దాదాపు 30 మంది వైద్యులు కలయికతో వారి మరపురాని రోజులను గుర్తు చేసుకుని , నేటితరం వైద్యులకు వారి యొక్క అనుభవాలను, వైద్యంలో వారి యొక్క మెలకువలను , నేటి కొత్త తరం వైద్యులకు వారి అనుభవాలను తెలిపారు. 1964 మొదటి బ్యాచ్ కి సంబంధించిన వైద్యురాలు అమెరికాలో స్థిరపడి నేను చదువుకున్న ఈ ఎస్ వి వైద్య కళాశాలకు ఎంతో రుణపడి ఉన్నానని నా కళాశాలకు నా వంతు సహకారం అందించాలని , ఈరోజు అమెరికా నుండి నేను చదువుకున్న వైద్య కళాశాలకు రావడం ఎంతో గర్వకారణంగా ఉందని డాక్టర్ రాధా గిరిధర్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ తెలిపారు. మేము అమెరికాలో స్థిరపడ్డాము, ఈ సందర్భంగా నేను మీకు "మానవీయ - అమెరికన్ " పై అవగాహన కార్యక్రమము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో నేటి కొత్త తరం వైద్యులకు వారి అనుభవాలను వైద్య విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ వి వైద్య కళాశాల నుండి అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులకు వైద్య పరిశోధనలో మీద 13 మంది వైద్య విద్యార్థులకు డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్షిప్ రూ:10,000 చొప్పున మొత్తం రూ: 1,30,000 విద్యార్థులకు చెక్కు రూపంలో ఇవ్వడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వైద్య విద్యార్థులు వారి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. అన్ని రంగాల్లో ముందుండి నడవాలని ఈ సందర్భంగా ఆమె వైద్య విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ రాధా (అమెరికా ) న్యూయార్క్, డాక్టర్ ప్రేమనంద్ , డాక్టర్ హరినాథ్, డాక్టర్ బాలకృష్ణ శెట్టి, డాక్టర్ రాఘవరెడ్డి, డాక్టర్ భారతి, రుయా సూపరేటెండెంట్ డాక్టర్ రవిప్రభు, ప్రసూతి ఆసుపత్రి సూపరేటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వసుంధరదేవి, (అకడమిక్ ), డాక్టర్ వెంకటేష్( అడ్మిన్ ), యూజీ, పీజీ వైద్య విద్యార్థులు, ఈ కళాయికా పూర్తి గా వైద్య విద్యార్థులు ద్వారా నిర్వహించడం జరిగింది, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి ఆర్ ఓ. వీరకిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV