Thursday, 30 July 2026 10:16:22 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నిరంతర వైద్య విద్య పై ఒక్కరోజు వర్క్ షాప్

Date : 23 August 2023 05:53 PM Views : 600

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : ఎస్వీ వైద్య కళాశాలలో నిరంతర వైద్య విద్య పై ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించడం జరిగినది. ఈ వర్క్ షాప్ ను అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ప్రారంభిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు, డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, వారి సూచనలతో వైద్య విద్యలో కలుగుతున్న కొత్త కొత్త మార్పులను, ఎప్పటికప్పుడు వైద్య అధ్యాపకులకు నిరంతరం వైద్య విద్య లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎస్ వి వైద్య కళాశాల చిన్నపిల్లల విభాగం లో శిక్షణ ఇవ్వడం జరిగినది. దీని ద్వారా వైద్య విద్యలో క్లినికల్, నాన్ క్లినికల్ లో టెక్నాలజీ మార్పులను వైద్య విద్య అభ్యసించే యూజీ, పీజీ, వైద్య విద్యార్థుల కొరకు, వైద్య అధ్యాపకులకు ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడంజరిగినది. ఎమర్జెన్సీ విభాగము మరియు తదితర విభాగము నందు వైద్య సదుపాయాలు గురించి, పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. అందుకొరకు ఈ నిరంతర వైద్య విద్య శిక్షణ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశించారని కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ కిరీటి తెలిపారు. ఈ ఒక్కరోజు దాదాపు 30 మంది వైద్య అధ్యాపకులు శిక్షణ తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ వసుంధర దేవి , విభాగాధిపతులు, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్, మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :