Famous TV - విద్య ఉద్యోగాలు / : ఎస్ వి. మెడికల్ కాలేజీ లో “సీనియర్ రెసిడెంట్” వైద్యులు ఖాళీలు భర్తీ చేయడం కొరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విజయవాడ వారి ఆదేశాల మేరకు, అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ వి వైద్య కళాశాల నందు సీనియర్ రెసిడెంట్ నియామకానికి తేదీ: 07 -08-2023వ తేదీన ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 05గంటల వరకు అభ్యర్థులకు ఎస్ వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం నందు వాక్ ఇన్ ఇంటర్వూలు జరుపబడును. ఈ దిగువ పేర్కొన్న విభాగాల్లో పోస్టులను భర్తీ చేసేందుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కోసం ఆహ్వానించడం జరుగుతోందఅన్నారు. పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు వివరాలు : ********** 1).అనాటమీ- 06 ఖాళీలు 2).ఫిజియాలజీ-04 ఖాళీలు 3).బయోకెమిస్ట్రీ -04 ఖాళీలు 4).ఫార్మకాలజీ-06 ఖాళీలు 5).పాథాలజీ-03 ఖాళీలు 6).మైక్రోబయాలజీ- 05 ఖాళీలు , 7).ఫోరెన్సిక్-04 ఖాళీలు, 8).కమ్యూనిటీ మెడిసిన్-06 ఖాళీలు, 09). జనరల్ మెడిసిన్-03 ఖాళీలు 10). జనరల్ సర్జరీ -06 ఖాళీలు 11). రేడియో డయాగ్నోసిస్ / రేడియాలజీ -03 ఖాళీలు, 12). ఎమర్జెన్సీ మెడిసిన్ -09 ఖాళీలు, 13). రేడియో థెరఫీ - 01 ఖాళీలు 14). హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ -01 ఖాళీలు 15). కార్డియాలజీ -01 ఖాళీలు, 16).న్యూరాలజీ-01ఖాళీలు, 17). కార్డియోతోరాసిక్ సర్జరీ / సి.వి.టి సర్జరీ-01ఖాళీలు, 18). ప్లాస్టిక్ సర్జరీ- 01ఖాళీలు, 19). యూరాలజీ-01ఖాళీలు, 20). న్యూరో సర్జరీ-01 ఖాళీలు. సీనియర్ రెసిడెన్సి పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తీసుకుని రావలసిన సర్టిఫికెట్స్ ఎస్ ఎస్ సి సర్టిఫికెట్ , ఎమ్.బి.బీ.ఏస్, పీజీ, డిగ్రీ సర్టిఫికెట్స్, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పీజీ మార్కుల లిస్టు, సోషల్ స్టేటస్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, 4వ తరగతి to 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్ లతో ఇంటర్వ్యూ కి హాజరుకావాలని కోరినారు. తదుపరి వివరాల కొరకు ఈ క్రింది వెబ్ సైట్ చూడవలసిందిగా తెలిపారు. https://chittoor.ap.gov.in https://tirupati.ap.gov.in www.svmctpt.edu.in సందేహాలు నిరువిత్తుకొరకు ఈ క్రింది నెంబర్ ని సంప్రదించవలెను ఫోన్ నెంబరు : 9246991845, బి. ఎం. గోవర్ధన్, సీనియర్ సహాయకులు, ఎస్వీ వైద్య కళాశాల తిరుపతి.
Admin
Famous TV