Monday, 14 September 2026 06:14:09 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

వైద్య విద్యార్థులకు రీసెర్చ్ కన్సల్టెన్సీ సెల్ ప్రారంభోత్సవం

Date : 13 September 2023 04:59 PM Views : 580

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : బుధవారము ఎస్వీ వైద్య కళాశాలలో సామాజిక వైద్య విభాగము నందు, వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్. చంద్రశేఖరన్,మరియు రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు రీసెర్చ్ కన్సల్టెన్సీ సెల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది మొట్టమొదటిసారిగా ఎస్ వి వైద్య కళాశాలలో రీసెర్చ్ కన్సల్టింగ్ సెల్ ప్రారంభించడం జరిగినది. యు జి, పీజీ వైద్య విద్యార్థులకు వైద్య అధ్యాపకులకు, అలైడ్ సైన్స్ విద్యార్థులకు, నర్సింగ్, ఫార్మా, మరియు సోషల్ సైన్స్, విద్య వైద్య రంగములోనే కాకా వివిధ రంగంలో పరిశోధనల నిమిత్తం చదువుతున్న మరియు పనిచేయుచున్న విద్యార్థినీ విద్యార్థులకు, ఈ రీసెర్చ్ కన్సల్టింగ్ సెల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు మాట్లాడుతూ రీసెర్చ్ కన్సల్టెన్సీ వలన మెరుగైన డేటాను పొందుపరచుకొనుటకు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం పై పరిశోధనలు జరిపి, అర్బన్ స్లమ్ ఏరియా లలో ప్రజలi ఆరోగ్యం పై డేటా కలెక్ట్ చేసి ఈ రీసెర్చ్ సెల్ నందు నిర్ధారణ చేసుకొని విలువైన సమాచారమును తయారు చేసుకొనవచ్చునని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వైద్యు శాస్త్రాన్ని అభివృద్ధి చేసి విస్తృతమైన మరియు ప్రభావితమైన పరిశోధనలకు నిర్వహించాలని ఉద్దేశంతో రీసెర్చ్ కన్సల్టెన్సీ సెల్ ప్రారంభించడం జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశము పరిశోధన రూపకల్పన మెథడాలజీ మరియు డేటా విశ్లేషణ పై మార్గదర్శకత్వం కోరుతూ పరిశోధకులు, అధ్యాపకులు విద్యార్థులందరికీ నిపుణుల కన్సల్టెన్సీ సేవలను అందించడమే ముఖ్య ఉద్దేశము. ఈ విధంగా వైద్య కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థుల మధ్య శోధనల అంచనా వృత్తిపరమైన అభివృద్ధి పెంపొందించడంలో ఈ రీసెర్చ్ కన్సల్టెన్సీ సెల్ ప్రారంభించడంజరిగినది. ఈ కార్యక్రమానికి ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ (అడ్మిన్ ), డాక్టర్ వెంకటేశ్వర్లు, పారామెడికల్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి లత, సామాజిక వైద్య విభాగాధిపతి డాక్టర్ సునీత, వివిధ విభాగాధిపతులు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, యూజీ, పీజీ వైద్య విద్యార్థులు, సామాజిక వైద్య విభాగ సిబ్బంది, మరియు ఎస్వీ వైద్య కళాశాల పి.ఆర్.ఓ. వీరకిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :