Wednesday, 29 July 2026 02:02:41 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వంద శాతం అక్షరాస్యత సాధన

అభినందించిన రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్

Date : 09 July 2023 04:04 PM Views : 446

Famous TV - విద్య ఉద్యోగాలు / గుంటూరు : మచిలీపట్నం జులై 9:--- వంద శాతం అక్షరాస్యత సాధనలో తన వంతు కృషిచేసి జి ఈ ఆర్ బ్యాడ్జ్ పొందిన ఓ వాలంటీర్ను వారి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి అభినందించిన అరుదైన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తన పర్యటనలో భాగంగా గుడివాడ మున్సిపల్ పట్టణంలోని 28వ వార్డు బేతవోలు-2 సచివాలయం లో వాలంటీర్ గా పనిచేస్తున్న ఎండ్రపు కల్పన ఇంటికి వెళ్లి ఆమెను అభినందించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా బడి ఈడు పిల్లలందరూ బడిలో చేరాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో వార్డు వాలంటీర్ కల్పన తన క్లస్టర్ పరిధిలో ఉన్న 21 మంది 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ నూటికి నూరు శాతం పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ చేసినందుకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జి ఈ ఆర్)బ్యాడ్జ్ లభించింది. ఈ విషయం ఆన్లైన్లో గమనించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆమె ఇంటికి వెళ్లి ఆమె ఎన్రోల్మెంట్ చేసిన విధానాన్ని, ఎవరెవరు ఎక్కడ, ఏమి చదువుతున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలతో సంతృప్తి చెందిన కార్యదర్శి ఆమెను అభినందించారు. ఆమె కుటుంబ సభ్యులతో కలసి వారు ఫోటో దిగారు. దీంతో వాలంటీర్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తనలాంటి వాలంటీర్లు చేసే పనిని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి అభినందిస్తారా అని ఆశ్చర్యపోయింది. తన ఇంటికి వచ్చి తనను అభినందించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఇది మరెందరో తన లాంటి వాలంటీర్లు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రాన్ని నూరు శాతం అక్షరాస్యత సాధించుటలో పాఠశాల విద్య కార్యదర్శి చేస్తున్న అవిశ్రాంత కృషికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తమ వంతు మద్దతు ఇస్తున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :