Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : ఇంజనీర్ కావాలన్నా తన కలను సహకారం చేసిన ఎమ్మెల్యే గారికి యాదవ కుటుంబం కృతజ్ఞతలు శ్రీకాళహస్తి మండలం,వాగువేడు పంచాయితీ, ఎల్లంపల్లి గ్రామానికి చెందిన సాయి సుధీర్ యాదవ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చదవాలని కలలు కన్నాడు. తిరుపతిలోని అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చేరిన తనకి వారి కుటుంబ ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఉండడంతో హాస్టల్ ఫీజు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఏమి చేయాలో అర్థం కాని తను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గారిని కలిసి తనకు సహాయం చేయాలని కోరాడు. సాయి సుధీర్ యాదవ్ కష్టాన్ని విన్న ఎమ్మెల్యే గారు వెంటనే తన సొంత డబ్బు ₹60,000/- వేల రూపాయలను ఆర్డిఓ రామారావు గారి చేతుల మీదుగా విద్యార్థికి అందజేశారు. అలాగే తనకు భవిష్యత్తులో ఏ సహాయం కావాలన్నా తాను చూసుకుంటానని .....తను బాగా చదువుకొని మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఎమ్మెల్యే గారు ఆశీర్వదించారు.
Admin
Famous TV