Sunday, 13 September 2026 03:56:30 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఉచిత మెగా ఇంపాక్ట్ - తిరుపతి

కరపత్రాన్ని విడుదల చేసిన జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ K. వెంకట రమణా రెడ్డి ఐఏఎస్ గారు

Date : 20 July 2023 07:44 PM Views : 1565

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : ఉచిత మెగా ఇంపాక్ట్ - తిరుపతి కరపత్రాన్ని తిరుపతి జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ K. వెంకట రమణా రెడ్డి ఐఏఎస్ గారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్స్ డాక్టర్ శ్రీధర్ విట్టలం, S. రత్నసేఖర్, తహసున్నీసా బేగం, నడ్డి నారాయణ, మునిలక్ష్మి తదితరులు పాల్గన్నారు. ప్రపంచంలో అత్యంత విలువైనది, శక్తివంతమైనది విద్య. విద్యతో పాటు విద్యార్థి వికాసం కూడా జరగాలి. జీవనోపాధిని కూడా కల్పించేదై ఉండాలి. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు, యువతకు అవసరమైన నైపుణ్యాలను శ్రీ గంపా నాగేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఫౌండేషన్ ( IMPACT FOUNDATION) గత 26 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని వారి నైపుణ్యాభివృద్దికోసం, వారిలో స్ఫూర్తినింపి ఆత్మవిశ్వాసంతో నిండిన బాధ్యతగల, సమర్థులైన పౌరులుగా తీర్చిదిద్దడం కోసం మెగా ఇంపాక్ట్ (MEGA IMPACT) కార్యక్రమం ఆగష్టు 9 మరియు 10 వ తేదీలలో నిర్వహిస్తారు. రెండు రోజుల పాటు స్థానిక మహతి ఆడిటోరియం నందు ఉదయం 9గంటల నుంచీ సాయంత్రం 6గంటల వరకూ జరిగే ఈ కార్యక్రమంలో సుమారుగా రాష్ట్రంలోనే కాక దేశంలో ప్రసిద్ధ వక్తలు, నైపుణ్యశిక్షకులు, వ్యక్తిత్వ వికాసనిపుణులు దాదాపు 30 మంది పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమ ప్రధానలక్ష్యం నిరుద్యోగులైన యువతీయువకులు, గ్యాడ్యుయేట్ విద్యార్థులు కనుక మొత్తం కార్యక్రమం ఉచితంగా నిర్వహించడమే కాక, హాజరైన విద్యార్థినీ విద్యార్థులకు మధ్యాహ్నభోజన సౌకర్యం కూడా కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకు 7416666489, 7702431281, 9160091606, 9912233305 నందు సంప్రదించగలరు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :