Sunday, 19 April 2026 05:42:16 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

11 మంది కౌటిల్య' విద్యార్థులకు ఐ.ఐ.ఎం అడ్మిషన్స్ (తిరుపతి విద్యార్థులకు ఐ.ఐ.ఎం అహ్మదాబాద్, బెంగళూరు , లక్నో MBA సీట్స్ )

Tirupati Kautilya's 11 Students achieve IIM admission

Date : 03 June 2023 07:48 PM Views : 814

Famous TV - విద్య ఉద్యోగాలు / : ఐ.ఐ.ఎం అడ్మిషన్స్ పొందిన విద్యార్థులను అభినందిస్తున్న కౌటిల్య డైరెక్టర్ శ్రీధర్ తిరుపతి ఎమ్.ఆర్.పల్లి సర్కిల్ వద్ద వున్న "కౌటిల్య ఇన్స్టిట్యూషన్ " సంస్థ కి చెందిన 11 మంది కి పైగా తిరుపతి విద్యార్థులు కు ఈ జూన్ నెలలో విడుదల చేసిన తుది ఫలితాలలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అత్యంత ప్రతిష్టాత్మక కాలేజీ లు అయిన ఐ.ఐ.ఎం.(ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్ మెంట్ ) లలో MBA అడ్మిషన్ సాధించారు. వీరిలో ఎస్.వి.యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్ధి అముజూరు మహేశ్వర్ కు ఐ.ఐ.ఎం అహ్మదాబాద్, కరణం చందన కు ఐ.ఐ.ఎం బెంగళూరు, రెడ్డెప్పగారి కేతన్ కు ఐ.ఐ.ఎం లక్నో అడ్మిషన్స్ లభించాయి. ఈ రెండు కాలేజీ లు ఇండియా లో నెంబర్ వన్ ఎమ్.బి.ఏ కాలేజీ లు మరియు అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచినవి కూడా. వీరితో పాటు, ప్రస్తుతం ఎమెరాల్డ్స్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్ దాసరి మురారి రెడ్డికి రెండు ఐ.ఐ.ఎమ్ అడ్మిషన్స్, అదే కాలేజీ విద్యార్ధి హర్ష వర్ధన్ వర్మ కు ఐ.ఐ.ఎమ్ అమృతసర్ అడ్మిషన్. గేట్ కాలేజీ పూర్వ విద్యార్థికి- జి.ధీరజ్ కుమార్ కు 4 ఐ.ఐ.ఎమ్ అడ్మిషన్స్ లభించాయి. ఈ 11 మందికి మొత్తం 70 కి పైగా ఐ.ఐ.ఎమ్ అడ్మిషన్స్ సాధించారు. వీరిని ఈ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ మరియు బోధనా సిబ్బంది సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు వారి తల్లి తండ్రులు వారి విజయానికి తోడ్పడిన కౌటిల్య కు కృతజ్ఞతులు తెలిపారు. వీరంతా కౌటిల్య లో క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్ ) కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొన్నారు. మరియు తిరుపతి లోని ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కాలేజీ లలో తమ డిగ్రీ లేదా బి.టెక్ పూర్తి చేసారు. వీరు 2022 నవంబర్ లో దేశ వ్యాప్తంగా 2 లక్షల మంది కి పైగా రాసిన 'క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్)' పరీక్షలో అత్యుత్తమ జాతీయ స్కోర్లు సాధించారు. ఈ క్యాట్ లో ఉతీర్ణత పొందిన అభ్యర్థులు కు ఐ.ఐ.ఎం లు నిర్వహించే గ్రూప్ డిస్కషన్స్ , వ్యాస రచన, పర్సనల్ ఇంటర్వ్యూ లలో మరల క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఈ ఐ.ఐ.ఎం లలో ఫైనల్ అడ్మిషన్ సాధించారు. ఈ అన్ని పరీక్షలు - క్యాట్ నుండి ఇంటర్వ్యూ దశ వరకు ఈ క్రింది విద్యార్థులకు శ్రీధర్ ఆధ్యర్వంలో ' కౌటిల్య' లో శిక్షణ పొందారు. ఈ క్రింది 11 మందితో పాటు మరొక 10 మందికి కూడా ఇండియా లోని టాప్ బిజినెస్ స్కూల్స్ లలో ( ఐ.ఐ.ఎఫ్. టి - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, సింబయాసిస్, టాటా ఇన్స్టిట్యూట్, ఎమ్.డి.ఐ.- మేనేజ్ మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్) MBA అడ్మిషన్ సాధించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లడుతూ 'ముందున్నవాళ్లకు ముందే అవకాశాలు దొరుకుతాయి ' అనే సామెత ఈ క్యాట్ లో చాలా బాగా పని చేస్తుంది. అంటే విద్యార్థులు తమ డిగ్రీ / లేదా బి.టెక్ చదువుతున్నప్పుడే తమ ఖాళీ సమయాన్నిఈ క్యాట్ పరీక్షకు బాగా ఉపయోగించుకోవాలి. సాధారణ డిగ్రీ- బి.ఏ, బి.కామ్, బి.ఎస్.సి లకు మరియు అమ్మాయిలకు ఐ.ఐ.ఎం లు అడ్మిషన్స్ విషయం లో చాలా ప్రాధాన్యత కూడా ఇస్తున్నాయి. క్యాట్ లో స్కోర్ తో పాటు, ఇంగ్లీష్ పై మరీ ముఖ్యంగా భావ వ్యక్తీకరణా నైపుణ్యాలు పై పట్టు వున్న అభ్యర్థులు కు ఐ.ఐ.ఎం లు ఆహ్వానం పలుకుతాయి. ఈ కాలేజీ లలో చదివిన వారికీ కోటి రూపాయల వరకు కూడా వార్షిక వేతనాలు కూడా లభిస్తున్నాయి . మన జిల్లా లోని ఎవరైనా ఈ క్యాట్ మరియు ఐ.ఐ.ఎం అడ్మిషన్స్ కు సంభందించి ఉచిత గైడెన్స్ కావాల్సిన వాళ్ళు మా తిరుపతి కౌటిల్య సంస్థను 9698123456 కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు.

ఐ.ఐ.ఎం అడ్మిషన్ పొందిన కౌటిల్య సంస్థ విద్యార్థులు 1 . అముజూరు మహేశ్వర్ - ఐ.ఐ.ఎమ్ -అహ్మదాబాద్ అడ్మిషన్. క్యాట్ స్కోర్ : 99 .39 పెర్సెన్టైల్. ఎస్ .వి.యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ ( ఈ .ఈ.ఈ ) పూర్తి చేసాడు. వీరి స్వస్థలం శ్రీకాకుళం. తండ్రి : అప్పన్న, వృత్తి : షిరిడి సాయి హాస్పిటల్ డైరెక్టర్, 2 . కరణం చందన- ఐ.ఐ.ఎమ్ - బెంగళూరు. క్యాట్ స్కోర్ : 98 .56 ఈ అమ్మాయి తండ్రి : కే ఉమామహేశ్వరన్, వృత్తి : ఆఫీస్ సూపరింటెండెంట్, సి.ఆర్.ఎస్ రైల్వేస్, తిరుపతి, తల్లి : పి ఆర్ లతా దేవి, వృత్తి : సీనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ.ఎస్.పి.డి.సి.ఎల్ 3 . రెడ్డెప్పగారి కేతన్ రెడ్డి - ఐ.ఐ.ఎం లక్నో అడ్మిషన్ క్యాట్ స్కోర్ : 99 .62 విద్య : బి.టెక్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ , క్యాలికట్ తండ్రి : ఆర్.హరినాథ్ రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగి - డిప్యూటీ ఇంజనీర్ - పోలీస్ హౌసింగ్ డిపార్ట్మెంట్ (తిరుపతి ) 4 . దొండపాటి తన్మయి, - ఐ.ఐ.ఎమ్ - కోజికోడ్ క్యాట్ స్కోర్ : 96 .62 తండ్రి : డి.భాస్కర్ నాయుడు, డివిజనల్ ఇంజనీర్, ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ , తిరుపతి 5 దాసరి మురారి రెడ్డి- ఐ.ఐ.ఎమ్ సిర్మౌర్, ఐ.ఐ.ఎమ్ -బోధగయ. ఇతను ప్రస్తుతం ఎమెరాల్డ్స్ డిగ్రీ కాలేజీ లో బి.బి.ఏ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేస్తున్నాడు. ఇతని తండ్రి - దాసరి మధు సూధన్ రెడ్డి, తిరుపతి జిల్లా వై.ఎస్.ఆర్.సి.పి జనరల్ సెక్రటరీ 6 . టి.భార్గవి, - ఐ.ఐ.ఎమ్ -కాశీపూర్ క్యాట్ స్కోర్ : 97 .94 తండ్రి : టి.సురేష్, రైతు (నగరి దగ్గర ఐన బాకం గ్రామం) 7 . జి.ధీరజ్ కుమార్ - 4 ఐ.ఐ.ఎమ్ అడ్మిషన్స్ ఇతను గేట్ డిగ్రీ కాలేజీ లో బి.కాం పూర్తి చేసాడు. 8 . టి.హర్ష వర్ధన్ వర్మ - ఐ.ఐ.ఎమ్ - అమృత సర్ ఇతను ఎమెరాల్డ్స్ డిగ్రీ కాలేజీ లో బి.ఎస్.సి. పూర్తి చేసాడు. వీరితో పాటు మరికొంత మంది ఐ.ఐ.ఎమ్ అడ్మిషన్స్ సాధించారు. మరియు టాప్ బిజినెస్ స్కూల్ లలో ఎమ్ .సాయి తరుణ్ రెడ్డి కి సింబయాసిస్ , పూణే లో , సి.ధర్మేశ్ కు సింబయాసిస్ బెంగళూరు , సి.హేమంత్ కు టీస్ ఇన్స్టిట్యూట్ లో MBA అడ్మిషన్స్ సాధించారు ఏ.మహేష్ (ఐ.ఐ.ఎమ్ -అహ్మదాబాద్) మాట్లడుతూ " నేను నా ఎమ్.బి.ఏ పూర్తి చేసిన తర్వాత పరిశ్రమ పై మంచి అవగాహన పెంచుకొని సొంతం గా స్టార్ట్ అప్ కంపెనీ ప్రారంభించి యువతకు తోడ్పడాలనుకొంటున్నాను. శ్రీకాకుళం లో వున్న మా తల్లి తండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకొంటున్నాను. ఐ.ఐ.ఎమ్ లో అడ్మిషన్ సాదించాలను కొనే విద్యార్థులు మంచి పట్టుదల, సానుకూల దృక్పథం తో పాటు శాస్త్రీయ ప్రేపరషన్ చెయ్యాలి. అదే విధంగా మంచి గురువుల సహాయంతో తమ ప్రేపరషన్ లో తప్పులు తెలుసుకోవాలి కూడా. " కరణం చందన మాట్లడుతూ " నేను బి.టెక్ తర్వాత డెలాయిట్ కంపెనీ లో పని అనుభవం సంపాదించా. సాంకేతిక నైపుణ్యం తో ఇప్పుడు ఐ.ఐ.ఎమ్ బెంగళూరు లో అడుగుపెడుతున్నాను. నవకల్పనలతో ముందుకు పోవాలనుకొంటున్నాను. విద్యార్థులు ఆన్ లైన్ లో క్యాట్ పరీక్షలు సాధన చెయ్యాలి మరియు క్యాట్ లో తక్కువ స్కోర్ వస్తే నిరుత్సాహ పడకుండా మరల మరొక సారి ప్రేపరేషన్ చెయ్యవచు. కేతన్ రెడ్డి : ఇండియా లోని టాప్ ఐ.ఐ.ఎమ్ - లక్నో లో సీట్ సాధించా. వీటిలో మేనేజ్ మెంట్ విద్య ద్వారా అత్యంత ఆధునాతన నిర్వహణ నైపుణ్యాలు , నాయకత్వ లక్షణాలు అంది పుచ్చుకోవచ్చు. తద్వారా దీర్ఘకాల భవిషత్తులో మనమే కొత్త కంపెనీలను స్థాపించవచ్చు కూడా. మన దేశం లో టాలెంట్ వున్న యువతతో జత కట్టి మన దేశ ఆర్ధిక రంగంలో అనేక విప్లవాత్మక విజయాలు సాధించవచ్చు మరియు సమాజం లో యువతకు సహాయ పడి, వీలైనంత వరకు మార్గదర్శి గా ఉండాలని అనేది నా దీర్ఘ కాలిక లక్ష్యం. ఐ.ఐ.ఎమ్ ఆశావహులు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవాలి. నేను దీని కోసం కౌటిల్య చాలా మంది విద్యార్థులకు క్లాసులు బోదించా. ఇది నాకు ఇంటర్వ్యూ లలో చాలా బాగా ఉపయోగపడింది

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :