Sunday, 13 September 2026 03:56:27 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

అరుదైన మూలకాలపై విస్తృత పరిశోధనలు సాగాలి

సెయింట్ పీటర్స్ వర్సిటీ ప్రొఫెసర్ గుణశేఖరన్

Date : 23 September 2023 06:15 PM Views : 522

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : అరుదైన మూలకాలపై యూనివర్సిటీ స్థాయిలో విస్తృత పరిశోధనలు సాగాలని చెన్నై లోని సెయింట్ పీటర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్. గుణశేఖరన్ పేర్కొన్నారు. అరుదైన మూలకాలు అంశంపై శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఫిజిక్స్ విభాగం సెనేట్ హాల్లో శనివారం జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో ప్రొఫెసర్ గుణశేఖరన్ కీలకోపన్యాసం చేశారు. తేనె, పాలు, నెయ్యి వంటి ఆహార పదార్థాల్లో నాణ్యతను పరిశీలించడానికి ఉపయోగపడే విధానం అందుబాటులో ఉందన్నారు. ఆహార పదార్థాలను గుర్తించడం అవసరమని అన్నారు. లేకపోతే ప్రజలు అనారోగ్యం పాలవుతారని తెలిపారు. చెన్నైలోని ఇచ్చియాన్ కంటెంట్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అధినేత డాక్టర్ జనని మాట్లాడుతూ.. మనుషులకు వచ్చే థైరాయిడ్ ను నివారించడానికి అవసరమైన మూలకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అయితే, వాటిని వినియోగంలోకి తీసుకు రావాల్సిన బాధ్యత ఈ తరం శాస్త్రవేత్తలపై ఉందని గుర్తు చేశారు. ఎస్వీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎండి హుస్సేన్ మాట్లాడుతూ.. మూలకాలపై చేపట్టే పరిశోధనలకు స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు. ఇలాంటి వర్క్ షాప్ వల్ల విద్యార్థులు, పరిశోధకులకు అవసరమైన అవగాహన కలుగుతుందని చెప్పారు. వర్సిటీ రీసెర్చ్ డీన్ ప్రొఫెసర్ విజయ భాస్కర్ రావు మాట్లాడుతూ.. రైతాంగానికి ఉపయోగపడే పరిశోధనలు చేపట్టాలని కోరారు. సభకు సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కెటి రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్ వీ జే లక్ష్మణ్ 90 వ జయంతి సందర్భంగా వారికి ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ రెక్టార్ ప్రొఫెసర్ సీకే జయశంకర్, రేర్ ఎర్త్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఎంఎల్ పీ రెడ్డి, వర్క్ షాప్ కన్వీనర్ ప్రొఫెసర్ బి. దేవి ప్రసాద్ రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ కమల శ్రీనివాసన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: