Monday, 14 September 2026 05:29:16 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

నిరుద్యోగులకు భవిష్యత్లో మరిన్ని అవకాశాలు - తిరుపతి ఎంపీ గురుమూర్తి

Date : 18 July 2023 05:57 PM Views : 487

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ కార్యాలయంలో సూట్స్ కేర్ నెట్‌వర్క్ కంపెనీ వారు జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకి 120 మంది అభ్యర్థులు హాజరు కాగా మూడు దశలలో జరిగిన ఇంటర్వ్యూలో 16 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గారు ఆఫర్ లెటర్స్ అందచేసి అభినందించారు. ఎంపికైన వారు కష్టపడి పని చేసి కంపెనీ ఉన్నతికి కృషి చేయాలనీ కోరారు. తిరుపతి జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు పేరెన్నిక గల కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని భవిష్యత్లో నిరుద్యోగ యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన తెలియజేసారు. సూట్స్ సోషియో హెల్త్ టెక్ కంపెనీ భారతదేశంలో అందరికి అందుబాటులో ఆరోగ్య సంరక్షణ మరియు గోల్డెన్ అవర్ ట్రామా కేర్ సాధించటానికి ఆరోగ్య సేవలు డిజిటలైజేషన్ ద్వారా ప్రజలలోకి తీసుకొస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలియజేసారు. అదే విధంగా తిరుపతి జిల్లా మాత్రమే కాకుండా చిత్తూరు జిల్లా నుండి అనంతపురం జిల్లా వరకు ప్రతిభ కలిగిన నిరుద్యోగులకు సూట్స్ కేర్ నెట్‌వర్క్ కంపెనీ వారు భవిష్యత్లో ఉద్యోగ అవకాశాలను కల్పించబోతున్నారని సూట్స్ కేర్ నెట్‌వర్క్ కంపెనీ సీఈఓ డా. సోమశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ సంస్థ సీఈఓ కిరణ్ కుమార్ రెడ్డి, జనరల్ మేనేజర్ చెవిరెడ్డి హేమచంద్ర రెడ్డి మరియు సూట్స్ సిబ్బంది పాల్గొనడం జరిగినది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: