Monday, 14 September 2026 06:14:13 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ కౌన్సిల్ ప్రభుత్వ వైద్య కళాశాల కోసం సవరించిన షెడ్యూల్ డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆఖరి తేదీ పొడిగిం

Date : 28 July 2023 04:40 PM Views : 618

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : శుక్రవారం, ఎస్ వి వైద్య కళాశాలలో రెండు సంవత్సరముల కాలవ్యవధి పారామెడికల్ ( అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కోర్సులకు దరఖాస్తుల ఆఖరి 19.08.2023 తేదీ వరకు పొడిగింపు. ఎస్వీ వైద్య కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర దేవి మాట్లాడుతూ (2023-2024), అకాడమిక్ ఇయర్ 05.07.2023 పారామెడికల్ , అడ్మిషన్లు ప్రారంభించడం జరిగినది. ఆసక్తి కలిగిన విద్యార్థిని, విద్యార్థులు రెండు సంవత్సరముల ఇంటర్మీడియట్ బై.పీ.సీ.లో ఉత్తీర్ణులైన, ఎం.పీ.సీ.లో కూడా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ డిప్లమా కోర్సులకు అర్హులు. ఎస్ వి వైద్య కళాశాలలో మొత్తం 76 సీట్లు అందుబాటులో ఉన్నవి. ఈ క్రింది విధంగా 1). డిప్లమా ఇన్ అనస్థీషియా టెక్నాలజీ -30 సీట్లు. 2) డిప్లమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ-30 సీట్లు, 3). డిప్లమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ -10 సీట్లు, 4). డిప్లమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ -06 సీట్లు అందుబాటులో గలవు. అర్హులైన తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, మరియు నెల్లూరు జిల్లా లోని విద్యార్థిని విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవలసినదిగా కోరడమైనది. ఈ రెండు సంవత్సరముల కాలవ్యవధి డిప్లమా కోర్సులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ విజయవాడ, వారి ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. కోర్సు ల దరఖాస్తులు కొరకు ఈ క్రింది వెబ్ సైట్ నందు పొందవలెను. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. ఏపిపిఎంబి. సీవో. ఇన్ లో www.appmb.co.in దరఖాస్తును డౌన్లోడ్ చేసుకునవలెను. పూర్తిచేసిన దరఖాస్తులను ఆఖరి తేదీ 19. 08. 2023, సాయంత్రం(05) ఐదు గంటల్లోపు రూపాయలు 100 చెల్లించి, ఎస్ వి వైద్య కళాశాల పారామెడికల్ సెక్షన్లో నమోదు చేసుకొనవలెను. పూర్తి చేసిన దరఖాస్తులు అన్ని వచ్చిన తరువాత వైద్య కళాశాల దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. దరఖాస్తులను అంతర్జాలంలో డౌన్లోడ్ చేసుకుని అందులోని నియమ నిబంధనలను సరిచూసుకొనవలసినదిగా కళాశాల ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా తెలిపారు. వివరాల కొరకు క్రింది సెల్ నెంబర్ కు 09440879943 సంప్రదించ వలయను. ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ (అలైడ్ హెల్త్ సైన్సెస్ ), డాక్టర్. ఎన్. మాధవి లత, అలైడ్ హెల్త్ సైన్స్ జూనియర్ అసిస్టెంట్ , శ్రీమతి నీలా రెడ్డి, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి. ఆర్. ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :