Tuesday, 15 September 2026 07:31:53 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

వ్యక్తిత్వమే విజయానికి సోపానం !

- ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి స్పష్టీకరణ

Date : 16 August 2024 10:00 AM Views : 773

Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : వ్యక్తిత్వ నిర్మాణం విజయానికి సోపానంగా మారుతుందని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేణిగుంట మండలంలోని ఆర్ సి ఆర్ బిజినెస్ స్కూల్ లో జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యక్తి శక్తిగా మారాలంటే విద్యతో పాటు సానుకూల దృక్పథం, నిజాయితీ, విశ్వసనీయత, సామర్థ్యం, నైపుణ్యాలు అవసరం అన్నారు. విద్యార్థులు తమను తాము సమగ్రమైన వ్యక్తులుగా నిర్మాణం చేసుకోవాలని సూచించారు. డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించారు. మూడు రంగుల జండా ఎగురవేశారు. కళాశాల కరస్పాండెంట్ ఆర్ శివప్రసాద్ వర్మ మాట్లాడుతూ ఆశావాదం, కృషి పట్టుదల ఉన్నప్పుడు అడ్డంకులను అధిగమించి విజయం సాధించవచ్చని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ వి రవికుమార్ చౌదరి మాట్లాడుతూ కార్పొరేట్ రంగంలో కమ్యూనికేషన్ స్కిల్స్, దూరదృష్టి, జట్టుకు ప్రేరణ కల్పించడం, సమన్వయ పరచడం లాంటి నైపుణ్యాలు ఉన్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంబిఎ విభాగాధిపతి వై నిరీష, ఎంసిఎ విభాగాధిపతి పి లలిత అధ్యాపకులు సతీష్, మురళి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మెరిట్ విద్యార్థులకు మెడల్స్,పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్ లు ఇచ్చారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :