Sunday, 13 September 2026 03:55:47 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఏపీలో ప్రతి మండలానికి రెండు జూనియర్‌ కాలేజీలు.. విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Date : 09 June 2023 11:09 AM Views : 432

Famous TV - విద్య ఉద్యోగాలు / : విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరు, వాటి పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ విద్యాశాఖ కు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు ఉండేలా చూసుకోవాలని, వచ్చే జూన్‌ నాటికి జూనియర్‌ కళాశాలలు ఏర్పాటయ్యేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నాడు – నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని, వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కార్యక్రమం ఉంటుందన్నారు. మొదటి దశ నాడు-నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో ఆరో తరగతి పైబడిన తరగతుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటుపై కూడా సీఎం సమీక్షించారు. ట్యాబ్‌ల వినియోగం, అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయంపై రివ్యూ చేశారు. స్కూళ్లలో ఇంటర్న్‌నెట్‌ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించామని, ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా స్కూల్లో చేరాలని సీఎం అన్నారు. డ్రాప్‌అవుట్స్‌ లేకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అకడమిక్‌ క్యాలెండర్‌ 2023-24ను సీఎం జగన్ విడుదల చేశారు. మరోవైపు ఏపీలో స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై క్లారిటీ ఇచ్చారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. జూన్ 12 నుంచి స్కూళ్లలో తరగతులు పునర్‌ ప్రారంభం అవుతాయని వెల్లడించారు.. అంతేకాదు. జూన్ 12 నుంచి 40 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్ల పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఒక్కో కిట్ కోసం ప్రభుత్వం రూ. 2500 ఖర్చు చేస్తుందని తెలిపారు. ఇక పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కోసూరులో సీఎం చేతుల మీదుగా జగనన్న విద్యాకానుక ఇవ్వడం జరుగుతుందని తెలిపారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: