Thursday, 30 July 2026 07:33:03 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాల ప్రతిభ పురస్కారాలు

స్కూల్ మొత్తం ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులది- ఎమ్మెల్యే భూమన

Date : 16 June 2023 03:54 PM Views : 448

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : స్కూల్ మొత్తం ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులది ఎమ్మెల్యే భూమన కార్పొరేట్ స్కూల్ దీటుగా మున్సిపల్ స్కూల్, నవరత్నాల్లో భాగంగా విద్యాశాఖకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు నగర మేయర్ డాక్టర్ శిరీష ప్రభుత్వ స్కూల్లో ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు నగర కమిషనర్ హరిత పిల్లల ఉజ్వల భవిష్యత్తు,మెరుగైన విద్యను అందించడం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ లో పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని,విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలుగా అభివర్ణిస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత లు వారిని సన్మానించి ఆశీస్సులు అందించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీర్చిదిద్దారన్నారు. అధునాతనమైన వసతులతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంత గొప్పగా ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ పాఠశాలలు గురించి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల గురించి ఆలోచించలేదన్నారు. బైజూస్ ద్వారా నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నారన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా స్కూల్ యూనిఫాం,పాఠ్య పుస్తకాలు,షూలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని తెలియచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరవై వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. మీ కోసం ఇంత చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి మీరు ఇచ్చే కానుక బాగా చదువుకుని ఉన్నతంగా ఉండాలని కాంక్షిస్తున్నానని తెలిపారు.

మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా విద్యాశాఖకు ఎక్కువ ప్రధానిత ఇస్తున్న సీఎం గారు నాలుగు సంవత్సరాలలో 98% వాగ్దానాలు నెరవేర్చడం జరిగిందని తెలియజేశారు. విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని తెలియజేశారు. నాడు నేడు ద్వారా స్కూల్ ని కార్పొరేట్ తరహాలో తీర్చిదించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తగ్గుతుందని మరియు అమ్మ ఒడి, విద్యా దీవెన, దీవెన పథకం అందించడం జరుగుతుందని, ఎనిమిదో తరగతి విద్యార్థులందరికీ లాప్ టాప్ లు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ప్రతి విద్యార్థులు బాగా చదివి, స్కూల్స్ కి, ఊరికి, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా విద్యార్థులని కోరారు. కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం మంచి శుభ పరిణామం తెలిపారు. జగనన్న ఆణిముత్యాలకు ఎంపికైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అందరూ ఉత్తమ ర్యాంకులు సాధించి స్కూల్స్ కి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి.ఈ.ఓ శేఖర్, యం.ఈ.ఓ ప్రభాకర్ రాజు, కార్పొరేటర్ బసవ గీత, గంగమ్మ గుడి చైర్మన్ కట్ట గోపి యాదవ్, కో ఆప్షన్ మెంబర్ వెంకట్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు బాలసుబ్రమణ్యం, ఉపాధ్యాయులు, మధుసూదన్ రెడ్డి,జనార్దన్ రెడ్డి, సురేష్, మంగమ్మ, అరుణ, విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :