Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : చిత్తూరు జిల్లా ఎస్. ఆర్. పురం మండలం లోని వెంకట్రామాపురం వాస్తవ్యులు శేఖర్ గత కొంతకాలంగా వారి మిత్రులతో కలిసి తిరుపతి లో ఉంటూ ఉద్యోగo కోసం శిక్షణ పొందుతున్నాడు. ఎస్. ఐ. ప్రిలిమినరీ పరీక్ష నందు కూడా పట్టు సాధించాడు. కానీ పేదరికం కారణంగా పుస్తకాలు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య కు సమాచారం అందుకొని డా. పి. ప్రభాకరరావు గారి సహకారంతో సుమారు 4,000 విలువ గల పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ మిమిక్రీ, మ్యాజిక్ అకాడెమీ గౌరవ అధ్యక్షులు డా. డి. విజయకుమార్,జిల్లెల బాలాజీ పాల్గొన్నారు
Admin
Famous TV