Wednesday, 29 July 2026 03:15:00 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బాల్యవివాహాలు జరుగుతున్నా పట్టంచుకోని అధికారులు వెంటనే కేసులు నమోదు చేయాలి,కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు గీత

Date : 22 November 2025 10:34 PM Views : 561

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టీవి న్యూస్ : సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు ఉత్తరాది గీత ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లో చాలా వరకు బాల్యవివాహాలు జరుగుతున్నాయని, ఈ బాల్యవివాహాలను స్థానిక రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తున్నారని ఆవిడ వాపోయారు.ఈ మద్య ఒక గ్రామంలో 17 సంవత్సరాల మైనర్ బాలికకు తల్లి,తండ్రి, అన్న, అక్క, బావ, మేనత్తలు కలసి బాల్యవివాహం చేశారని, దీనికి సంబందించిన వివరాలు ఒక స్వచ్చంద సేవా సంస్థ వారు పోలీస్ వాట్సప్ కు పిర్యాదు చేశారని, ఐతే ఈ బాల్యవివాహం విషయం లో ఒక వ్యక్తి తనదైన శైలిలో రాజకీయం చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయని, అలాగే చౌడేపల్లి పట్టణంలో కూడా ఒక బాల్యవివాహం జరిగిందని, ఈ విషయం కూడా పోలీసులకు తెలిసిందని, పోలీసులు బాల్యవివాహం విషయం బయటకు చెప్పడంతో సదరు గ్రామాలలో గొడవలు శృష్టిస్తున్నారని, ఆవిడ వాపోయినది. ఈ విషయం పై త్వరలో జిల్లా అధికారులను కలసి పిర్యాదు చేయనున్నట్లు ఉత్తరాది గీత అన్నారు. ఒకపక్క బాల్యవివాహాల పై ప్రభుత్వం ఖటినమైన నిర్ణయాలు తీసుకొంటుంటే ఇక్కడ మాత్రం స్థానిక రాజకీయ నాయకుల కనుసన్నలలో బల్యవివాహాలు ప్రోత్సహిస్తున్నారు. ఇక నైనా అధికారులు సమోటోగా కేసులు నమోదుచేసుకొని, బాల్యవివాహాలు చేసిన తల్లిదండ్రుల పై,వారికి మద్దతునిచ్చిన కుటుంబ సభ్యూల పై, రాజకీయ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆవిడ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :