Wednesday, 29 July 2026 06:38:13 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బడా రాజకీయ నాయకుల పేర్లు చెప్పి దోపిడీ చేస్తున్నారు, వీరిని అడ్డుకునేదెవరు?

Date : 26 September 2025 08:04 PM Views : 751

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : ఎటు చూసిన దోపిడి అటు ఎర్రమట్టి, ఇటు చెరువు మట్టి చౌడేపల్లి ఫేమస్ న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలోని శెట్టిపేట గ్రామపంచాయతీ, తోటకురప్పల్లి సమీపంలో గల ఆంజనేయ గుడి వద్ద అడ్డగుట్టను కొందరు రాజకీయ నాయకులు, పెత్తందారులు రెవిన్యూ శాఖలో తమ పలుకుబడి ఉపయోగించి అనధికార అనుమతితో ఎర్ర మట్టిని జెసిబి సహాయంతో ట్రాక్టర్లతో తొవ్వుకొని అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ మట్టి ఖరీదు 450 నుండి 500 పలుకుతుంది. ఇదే విషయం పైన గత పది రోజులు క్రితం గ్రామ రెవిన్యూ అధికారిని, మండల తాహశిల్దార్ ని వివరణ అడగ్గా అప్పటికప్పుడే మట్టి తోలడం ఆపించారు. అయితే తీగ రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి తిరిగి యధావిధిగా మట్టి తోలడం ప్రారంభించారు. మంగళవారం నుండి ఏమాత్రం నీ ఏమాత్రం నీలుకు లేకుండా గురువారం ఉదయం వరకు సుమారు ఐదు ట్రాక్టర్లతో ఎర్రమట్టిని తోలుతున్నారు. ఈ విషయం తీసిన కొందరి మీడియా అక్కడికి వెళితే మట్టి మాఫియా నాయకుడు మీది ఏమైనా పెద్ద పోటుగాళ్ళ, ఎవడో నాపైన కేసు పెట్టండి చూసుకుంటాను అంటూ రెచ్చిపోయాడు. అంతేకాకుండా సదరు న్యూస్ రిపోర్టర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరింపులు చేశాడు. ఈ విషయం పైన చౌడేపల్లి తహశిల్దార్ ను వివరణ అడగ్గా అడ్డగుట్ట ప్రాంతం సోమల మండల రెవెన్యూశాఖ పరిధిలోనికి వస్తుందని తెలియజేశారు. ఇదే విషయమై సోమల మండల తహ ఇదే విషయమై సోమల మండల తహశిల్దార్ ను వివరణ అడగ్గా మండల సర్వేయర్ ను అడిగి చెప్తానన్నారు. అంతేకాకుండా ఎక్కడ చూసినా చేరువు మట్టిని ఎటువంటి అనుమతి లేకుండా విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. ఇది ఏమని అడిగితే దౌర్జన్యాలకు పాల్పపడుతున్నారు. అంతేకాకుండా గ్రామస్థాయిలో, మండల స్థాయిలో పేరుగల రాజకీయ నాయకుల పేర్లు వాడుకొని బెధిరింపులకు గురిచేస్తున్నారు. సామాన్యులనే కాదు అధికారులను సైతం రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరింపులు చేస్తున్నారు. సదరు రాజకీయ నాయకులకు ఈ విషయం తెలియక అటువంటి దోపిడీగాళ్ళను,చీటర్స్, రౌడీలను వెనకేసుకొస్తున్నారు. ఈ విధముగా జరిగే అడ్డగుట్ట ప్రాంతంలో సుమారు 500 మీటర్లు పొడవునా ఎర్రమట్టిని దోపిడి చేశారు.అడ్డుగుట్ట ప్రాంతం ఏ మండల పరిధిలోకి వస్తుందో తెలియక తికమక పడుతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ కలగజేసుకొని మండల రెవెన్యూ సరిహద్దులను ఏర్పాటు చేయాలని, అలాగే మట్టి మాఫియా పై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: