Monday, 14 September 2026 07:40:30 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు

Date : 23 January 2026 02:30 AM Views : 764

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల పోలీస్ స్టేషన్ పరిధిలో 2016వ సంవత్సరంలో జరిగిన ఒక హత్య కేసులో.... పదేళ్ల క్రితం నాటి హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు.... అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి... సోమల పోలీస్ స్టేషన్ పరిధిలో 2016వ సంవత్సరంలో జరిగిన ఒక హత్య కేసులో నేరస్తులకు మదనపల్లె రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా శాస్త్రీయ ఆధారాలతో, పక్కాగా సాక్ష్యాలను ప్రవేశపెట్టిన పోలీస్ అధికారులను మరియు ప్రాసిక్యూషన్ బృందాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేకంగా అభినందించారు. కేసు వివరాలు: 2016 జనవరి 25వ తేదీన సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీ ఎర్రమిట్ట గ్రామంలో వి. కమలమ్మ (47) అనే మహిళ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై సోమల పోలీసులు కేసు (Cr.No.2/2016) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టు తీర్పు: రెండవ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి పి.వి.ఎస్. సూర్యనారాయణ మూర్తి ఈ కేసును విచారించి, నిందితులపై నేరం రుజువు కావడంతో తీర్పు వెలువరించారు. నిందితులు:*l A1 - వీరపల్లి శ్రీనివాసులు నాయుడు (48), A2 - వి. గంగులమ్మ (70). శిక్ష: వీరిద్దరికీ సెక్షన్ 302 IPC కింద జీవిత ఖైదు మరియు ఒక్కొక్కరికి రూ.5000 జరిమానా. సెక్షన్ 324 కింద మరో ఏడాది జైలు శిక్ష మరియు రూ. 1000 జరిమానా విధించారు. (మొత్తం జరిమానా రూ. 12,000). నేరంలో పాలుపంచుకున్నట్లు తగిన ఆధారాలు లేనందున A3 (వెంకటరమణ నాయుడు)ను కోర్టు విడుదల చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. "బాధితులకు న్యాయం జరగాలంటే దర్యాప్తులో నాణ్యత చాలా ముఖ్యం. పదేళ్ల క్రితం నాటి కేసు అయినప్పటికీ, పట్టువదలక సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టి నిందితులకు శిక్ష పడేలా చేసిన సోమల పోలీసులను, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (Addl. P.P) జి.ఎస్. శైలజ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేరస్తులు ఎవరైనా చట్టం నుండి తప్పించుకోలేరని ఈ తీర్పు మరొకసారి నిరూపించింది" అని పేర్కొన్నారు. నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన కొలిక్కి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్క అధికారి ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: