Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లో ఒక గ్రామంలో తాతలు సంపాదించిన ఆస్తులు పంచుకోవడానికి తాతలను తండ్రులు గా ఆధార్ కార్డులను సైతం మార్చుతున్నారు. ఐనా ఆధార్ కార్డులు నమోదుచేసే అధికారులు ఎటువంటి ఆధారాలు లేకుండా ఏవిధముగా తండ్రుల పేరు మార్చుతారు. ఇటువంటి స్కాం లు చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లో వేలుగు చూసింది.ఒక యువకుడి క్రిమినల్ ఆలోచన భూములకు పెరుగున్న ధరలు, చూస్తుంటే ఒక తల్లిదండ్రులకు పుట్టిన అన్నదమ్ములను సైతం దూరం చేస్తుంది. ఇటువంటి సంఘటన చౌడేపల్లి మండలం లో వెలుగు చూసింది, అంతే కాదండోయ్ మండలం లోని ఒక మారుమూల సచివాలయం లో ఎక్కడో పుట్టిన వారికి సైతం, ఇతర జిల్లాల వారి, ఇతర రాష్ట్రాల వారివి సైతం ఐదువేలు ఇస్తే జనన, మరణ దృవీకరణ పత్రాలు తయారు చేసి ఇచ్చిన కథనాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి.ఇటువంటి వాటి పైన సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ నిఘా విభాగము నిఘా ఉంచి ఆధారాలు సేకరిస్తుంది. ఇప్పటికే నకిలీ దృవీకరణ పత్రాలు తయారు చెసినటువంటి అధికారులు కొందరు బదిలీ అయ్యారు, పూర్తి ఆధారాలతో ప్రజలముందుకు తీసుకొని వస్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత అన్నారు.
Admin
Famous TV