Sunday, 13 September 2026 04:37:30 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ద్విచక్ర వాహనాలను దొంగలించే అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

20 లక్షలు విలువ చేసే 22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

Date : 02 July 2023 01:31 PM Views : 475

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : గత కొన్ని రోజులుగా చిత్తూరు, తవణంపల్లి, బంగారుపాళ్యం మండలాలలో మరియు చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నందున, రాజశ్రీ చిత్తూరు జిల్లా SP శ్రీ.Y.రిశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, చిత్తూరు సబ్-డివిజన్ DSP శ్రీ K.శ్రీనివాస మూర్తి గారి పర్యవేక్షణలో, చిత్తూరు రూరల్ వెస్ట్ CI శ్రీ I.రవిశంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తవణంపల్లి P.S., SI, P.V.సుధాకర్ రెడ్డి మరియు సిబ్బంది సహితంగా ఈ దినం అనగా 01-07-2023 వ తేదిన తవణంపల్లి మండలం, పట్నం గ్రామ సమీపంలో గల ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద 01.00 PM గంటలకు C.గోవింద రాజ్, వయస్సు 29 సం”లు, S/o C.శివరాజ్, గుట్టక్రింద హరిజనవాడ గ్రామం, కీనాటంపల్లి పోస్టు, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా అను అతనిని అరెస్టు చేసి, అతని వద్ద వుండిన 01 మోటార్ సైకిల్ ను మరియు అతను ఇచ్చిన వాంగ్మూలం మేరకు అతను వివిధ ప్రాంతాలలో దొంగలించి దాచి ఉంచిన వివిధ కంపెనీలకు చెందిన మరో 21 ద్విచక్రవాహనాలు, అనగా మొత్తం సుమారు 20 లక్షల రూపాయల విలువ 22 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకోవడమైనది. సదరు C.గోవింద రాజ్ తవణంపల్లి PS పరిధిలో 6 మోటార్ సైకిళ్ళు, బంగారుపాళ్యం PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, చితూరు I Town PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, G.D.నెల్లూరు PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, SR పురం PS పరిధిలో రెండు మోటార్ సైకిళ్ళు, ఇంకా వివిధ ప్రాంతాలలో మరో 8 మోటార్ సైకిళ్ళను దొంగతనం చేయడమైనది. పట్టుబడిన ముద్దాయి యొక్క వివరాలు: C.గోవింద రాజ్, వయస్సు 29 సం”లు, S/o C.శివరాజ్, గుట్టక్రింద హరిజనవాడ గ్రామం, యాదమరి మండలం, కీనాటంపల్లి పోస్టు, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా. ఈ కేసు లో పాల్గొన్న తవణంపల్లి SI, P.V.సుధాకర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని అభినందించినారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :