Saturday, 13 June 2026 12:24:39 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ధని ఫైనాన్సు లో మీకు లోన్ వచ్చింది అని టోకరా , డబ్బు డ్రా చేయాలంటే ముందుగా కొంత నగదు జమ చేయాలి

Date : 27 September 2025 06:49 PM Views : 764

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలోని 29 ఏ చింతమాకులపల్లి గ్రామపంచాయతీ బల్లపల్లి కి చెందిన దీపట్ల కృష్ణప్ప కుమారుడు దీపట్ల రవికి శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో 8601605396 అనే నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ సారాంశం ఏమిటంటే అవతలి నుండి మాట్లాడిన వ్యక్తి మేము హైదరాబాద్ ధని ఫైనాన్స్ నుండి కాల్ చేస్తున్నాము. మీకు ఐదు లక్షల రూపాయలు మంజూరు అయిందని మీరు ప్రస్తుతం 20 వేల రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే వెంటనే మీకు మీ బ్యాంక్ అకౌంట్ కు 5 లక్షలు జమవుతుందని నమ్మబలికాడు. రవి వెంటనే తన ఫోన్ పే ద్వారా 20 వేల రూపాయలు అతని అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత తీరిగి ఆ వ్యక్తి ఇన్కమ్ టాక్స్ కట్టడానికి 15 వేల రూపాయలు చేల్లించాలని తిరిగి ఫోన్ చేశాడు. వెంటనే రవి తీగి 15 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించడం జరిగింది. తిరిగి సదరు వ్యక్తి కమిషన్ 15000 చెల్లించాలని చెప్పడం చేశాడు. ఆయన అలా చెప్పాడో లేదో వెంటనే రవి 15000 రూపాయలు ఫోన్ పే చేయడం 15000 రూపాయలు ఫోన్ పే చేశాడు. ఇది ఇలా ఉండగా అతని ఆధార్ కార్డు, ఐడి కార్డు వాట్సప్ ద్వారా పెట్టి నేనేమీ మిమ్మల్ని మోసం చేయలేదు కావాలంటే నా ఐడి కార్డు చూసుకోండి అంటూ నమ్మబలికాడు. అతని ఆధార్ కార్డు నందు కామని విజయ రావు ఆధార్ కార్డు నెంబర్ 941206292825 కా నమోదు చేయబడింది. అతని ఐడి కార్డులో కూడా బంజారా హిల్స్ హైదరాబాద్ అడ్రస్సు ఉన్నది. అతను తిరిగి ఫోన్ చేసి ఇంకా 49000 వేల రూపాయలు చెల్లిస్తే మీ అకౌంట్ కు 5 లక్షలు జమవుతుందని చెప్పారు. మీరు గనక డబ్బులు కట్టకపోతే మేమే మీ ఇంటికి వస్తామని, అక్కడికి వచ్చి మీ అంతు చూస్తామని బెధించడం జరిగింది. ఈ విషయం పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తే గ్రామంలో అవమానం జరుగుతుందని మిన్ను కుండిపోయారు. కావున ఇకనైనా స్థానిక పోలీసులు సైబర్ క్రైమ్ లపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :