Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : చిత్తూరు ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా,చౌడేపల్లి మండలంలోని గాంధీవీధికి చెందిన కోలా గౌతమ్ గోసలకురప్పల్లిలో అంద ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.ఆయనకు ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు సరిపోలేదేమో అతను తన కుటుంబ సభ్యుల ద్వారా చిత్తూరు(ప్రస్తుతం అన్నమయ్య)జిల్లా,చౌడేపల్లి మండలం,దిగువపల్లి గ్రామపంచాయతీ,యానాదిపాళ్యం నుండి చిన్నపిల్లలను తక్కువ రేటుకు కొనుకొని విశాఖపట్నం వంటి ప్రాంతాలలో అధిక మొత్తంలో విక్రయాలు జరుపుతున్నారు.గత వారం క్రితం కూడా ఒక ఆడపిల్లను ఒక మహిళ తెచ్చివాళ్ళకు ఇవ్వడంతో చుట్టు ప్రక్కల వాళ్ళు చూడటం,చంటిబిడ్డ లేనిఇంట్లో పిల్లల ఏడుపు వినిపించడం వంటివి గమనించిన చుట్టుప్రక్కల వాళ్ళు వాళ్ళ ఇంటికి తరచుగా వచ్చివెళ్ళే మహిళను విచారించగా నలబైవేలుకు ఆడపిల్లను అమ్మానని,ఇంకో మగపిల్లవాడ్ని సైతం డెబ్బై వేలుకు అమ్ముతున్నట్లు తెలిపింది.వాళ్ళు మాకు ఒక పిల్లవాడు కావాలంటే గాంధీ విధిలో ఉన్న శిల్పా,కుమారమ్మ,గౌతమ్ తో మాట్లాడండి అని చెప్పడం జరిగింది.ఈ విషయం గతవారం పత్రికల్లో వచ్చినది,ఐసిడిఎస్ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళగా పక్కా ప్రణాళికతో పట్టుకోవాలని,స్కెచ్ వేశారు.ఐతే సదరు విక్రయ ముఠా సభ్యులు అనునిత్యం గొడవలు చేస్తుండటంతో సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ(కార్డ్స్) స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పిజిఆర్ఎస్ లో చిన్నపిల్లల విక్రయాల పై పిర్యాదు చేయడం జరిగింది.పిర్యాదు నెంబర్ సిటిఆర్ 20260102972 గా నమోదు చేసి,సదరు సమస్య పరిష్కారం కొరకు యస్.హెచ్.ఓ చౌడేపల్లి వారికి పంపడమైనదని వారు తెలియజేశారు.ఐతే ఈ సమస్య పైన గతంలోనే ఐసిడిఎస్ వారికి తెలియజేయడం జరిగింది.ఐసిడిఎస్ వారు నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.ఐతే ఎటువంటి నిఘాలేనందున శుక్రవారం పిజిఆర్ఎస్ నందు పిర్యాదు చేసిన విషయం తెలిసినదే ఇదిలా ఉండగా సదరు కుమారమ్మ, పత్రికల్లో రాసుకోని,టీవిచానళ్ళలో ఇచ్చుకోని,ఎవడు వచ్చి ఏమి పీక్కుంటారో చూద్దాం అంటూ, మాకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి.అంతే కాకుండా సదరు విలేకరి డబ్బులు డిమాండ్ చేశాడంటూ వదంతులు శృష్టించిన ఉపాద్యయ కుటుంబ సభ్యులు. వీధులలో నిల్చొని ఔను చిన్నపిలల్ని అమ్మినది నిజమే ఎవడు ఏమి చేయలేడు అంటూ మాట్లాడి,పిర్యాదు దారుడ్ని చూపిస్తూ నిన్ను నీ కుటుంబాన్ని లేపేస్తాం,ఎవడు వచ్చి కాపాడూతాడో చూద్దాం,నీ పేపర్ ఏమి రాస్తావో రాసుకో,నీ పని నువ్వు చెయ్యి మా పని మేము చేస్తాం అంటూ మాట్లాడినారు.వారు చిన్న పిల్లల్ని తీసుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. దత్తత తీసుకున్నాం, ఎవడు ఏమి చేయలేడు అన్నారు. దత్తత తీసుకోవాలంటే దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం తల్లిదండ్రుల అనుమతి పత్రం,వారి ఆధార్ కార్డులు,వీళ్ళ ఆధార్ కార్డులు,సాక్ష్యం గా ఉన్న వ్యక్తులు, ఎవరి సమక్షంలో దత్తత తీసుకున్నారు. సదరు దత్తత కు సంబందించిన వివరాలు, ఏవైనా అభ్యంతరాలు,దత్తత ఇస్తున్న తల్లిదండ్రులు,దత్తత తీసుకన్న తల్లిదండ్రులు కలసి పరస్పర అంగీకార పత్రాలు ఉండాలి, అలాకాకుండా దత్తత తీసుకుంటే అదిచట్టరిత్యా నేరం అనే విషయం సదరు వ్యక్తులకు తెలియదా? ఈ సమస్య పైన ఐసిడిఎస్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారో అర్థం కావడంలేదని ప్రజలు వాపోతున్నారు.సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు ఎస్సి కులానికి చెందిన వారని తెలిసి కూడా సదరు ఉపాధ్యాయుడు, అతని కుటుంబ సభ్యులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి చౌడేపల్లి పోలీసులు వెంటనే ఎస్సి, ఎస్టీ అత్యాచార నిరోదక చట్టం 1989 ప్రకారం సదరు ఉపాద్యాయుడు, అతని కుటుంబ సభ్యుల పై కేసునమోదుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Admin
Famous TV