Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి జూన్ 24 చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని పెద్ద యల్లకుంట్ల గ్రామపంచాయతీ ఊటూరు సమీపం లో ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ను దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం లో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి.క్షతగాత్రుల కథనం మేరకు చిత్తూరు జిల్లా,సోమల మండలం పెద్దఉప్పరపల్లి సమీపంలో గల బోన్ ముందుకు చెందిన వారు తమ మ్రొక్కు తీర్చుకోవడానికి బోయకొండ గంగమ్మ దేవస్థానం కు వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఊటూరు సమీపం లో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిందని, దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు,108కు సమాచారం అందించారు.ప్రమాదం సంఘటన విన్న వెంటనే ఎస్సై నాగేశ్వర్ రావు తన సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను అటుగా వస్తున్న వాహనాన్ని ఆపి చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపారు. ఈ ప్రమాదంలో గంగాదేవి,భవాని,రుషీ, కీర్తి లకు బలమైన గాయాలు కావడంతో చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స నిమిత్తం పుంగనూరు ఏరియా ఆసుపత్రి కి రెఫెర్ చేశారు.పోలీసులు ఈ సంఘటన నేపథ్యంలో లో కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Admin
Famous TV