Tuesday, 15 September 2026 09:15:09 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

అధికారుల నిర్లక్షమా లేక కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా కరెంటు స్థంభం పై నుండి పడి కార్మికుడికి గాయాలు

Date : 18 December 2025 09:39 PM Views : 548

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టీవి న్యూస్ : జిల్లాలోని పుంగనూరు మండలం, చదళ్ళ గ్రామం సమీపంలో 33 కేవి విద్యుత్ లైన్ షిప్టింగ్ చేస్తూ కరెంటు స్థంభం పై పైనుండి పడి కార్మికుడికి తీవ్రగాయాలు.సంఘటన సోమవారం జరిగినా ఇప్పటి వరకు బయటకు పోక్కకుండా చేశారంటే తప్పెవరిది.గుట్టు చప్పుడు కాకుండా తిరుపతి లో ఒక ప్రవేటు ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్న కాంట్రాక్టర్.గాయపడ్డ కార్మికుడు చౌడేపల్లి మండలం,చిట్రెడ్డిపల్లి కి చెందిన హరి(45)గా గుర్తింపు. ఈ విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా ఒక ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న నేపత్యంలో పలు అనుమానాలు రేకెత్తుతున్నట్లు తెలుస్తుంది. ప్రమాద స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. చదళ్ళ గ్రామం సమీపంలో కాటిపేరి రోడ్డు నందు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు ప్రక్కన గల ఖాళీ స్థలంలో హౌసింగ్ మంజూరైనదని, సదరు స్థలం లో 33కేవి విద్యుత్ లైన్ వెళ్తుందని, దానిని ప్రక్కకు మార్చుతున్న నేపత్యంలో ఈ సంఘటన జరిగిందని, క్షతగాత్రుడు విద్యుత్ స్థంభం పైన చాలా సేపు కూర్చొని ఉన్నాడని, ఐతే ఒక్కసారిగా కంరెంటు వచ్చేసిందని విద్యుత్ స్థంభం పై నుండి క్రిందకు పడ్డాడని స్థానికులు ప్రత్యక్ష సాక్షలు తెలియజేశారు. ఈ విషయం పై ఏడి శ్రీనివాసులు ను మా ప్రతినిధి చరవాణిలో వివరణ అడుగగా జరిగిన ప్రమాదం ఎలక్ట్రికల్ ప్రమాదం కాదని, అన్ స్కిల్డ్ వలన ప్రమాదం సంభవించినదని, దీనికి డిపార్ట్మెంట్ కు ఎటువంటి సంబంధం లేదని తెలియజేశారు.ఇదిలా ఉండగా 33 కేవి విద్యుత్ వైర్లు ఎవరి అప్లికేషన్ ప్రకారం మార్చుతున్నారని,ఎస్టిమేషన్ వివరాలు తెలియజేయమని అడిగితే వాటి వివరాలు తెలియజేయడం లేదు.దీనిబట్టి చూస్తే అధికారుల నిర్లక్ష్యం నిండుగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా గాయపడిన కార్మికడు గత ఇరవై సంవత్సరాలుగా విద్యుత్ పనులు చేస్తున్నారని, ప్రస్తుతం అతను ఐసియూ నుండి జనరల్ వార్డు కు మార్చారని తెలిసింది. అంతే కాకుండా గాయపడిన కార్మికుడి వివరాలు గానీ, ఫోటోలు గాని బయటకు పోక్కనీకుండా జాగ్రత్తలు పడుతుండటం పై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం పైన సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ అధ్యక్షురాలు ఉత్తరాది గీత మాట్లాడుతూ అధికారులు వర్క్ ఎస్టమేషన్ వివరాలు, కాంట్రాక్టర్ వివరాలు తెలియజేయడంలో విఫలమయ్యారని, అలాగే కాంట్రాక్టర్ కార్మికులకు ఈపియఫ్ సౌకర్యం చేయించాడా లేదా అని కూడా తెలియజేయడంలేదని, అంతే కాకుండా 33కేవి విద్యుత్ వైర్లు పనులు నిర్వహించేటప్పుడు ఏడి స్థాయి అధికారుల పర్యవేక్షణ లో జరగాల్సిన పనులు ఎవరూ లేకుండా ఎలా చేస్తారని ఆవిడ అన్నారు. కావున వెంటనే సంబందిత అధికారులు ఈ సంఘటన పై విజిలెన్స్ విచారణ చేసి, అధికారుల నిర్లక్ష్యం పై చర్యలుతీసుకోని, సదరు కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దుపరచాలని లేదంటే ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపట్టాల్సి ఉంటుందని సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 133/2024 అధ్యక్షురాలు అన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :