Monday, 14 September 2026 06:50:40 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

బోయకొండ లో సిబ్బంది చేతివాటం - పోలీసుల ప్రాథమిక విచారణ

Date : 23 July 2025 06:06 PM Views : 698

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ :: చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం, బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు సిబ్బంది చేతివాటం చూపించి, అధికారుల కళ్ళుగప్పి దోచుకుంటున్నారు. అమ్మవారికి జంతుబలులు ఇవ్వడం ప్రధానం, ఐతే ఆంద్రప్రదేశ్ నుండినే కాకుండా అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, దక్షిణ భారత దేశం నుండి ఆది, మంగళ, బుద, గురు వారాల్లో జంతుబలులు సమర్పిస్తూ, తమ కోరికలు తీర్చాలని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటుంటారు. గతం లో ఇక్కడ పెద్దబోగం, చిన్న బోగం అంటూ ఏర్పాటు చేసి ప్రస్తుతం కూడా వాటిని టెండర ద్వారా వేలం వేయడం జరిగింది. అంటే అమ్మవారికి మొక్కలు తీర్చుకొనేవారు అమ్మవారికి సమర్పించే జంతుబలులకు సంబందించి, శుభ్రంచేయడానికి, తలలను అమ్ముకోవడానికి వేలం ద్వారాపాట జరిగినది, అక్కడ వేలం పాటదారులు వారి నిబందనల ప్రకారం చిన్నభోగము, పెద్దభోగము శుభ్రపరచడం, తలలు వేలం వేసుకుంటున్నారు. ఐతే 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి పెద్దబోగమూ, చిన్నభోగము అమ్మవారి మొక్కలు చెల్లించడానికి వచ్చిన వాటినుండి అమ్మవారి కి ఆదాయం కొరకు, అలాగే ప్రతిరోజు ఎన్ని బలులు సమర్పించారనే సంఖ్య ఖచ్చితంగా ఉండాలని, ప్రతి చిన్నభోగము, పెద్దభోగము కు రెండూవందల రూపాయలు టికెట్టు ఏర్పాటు చేసి, అందులో రశీదులను రెండుగా చేస్తూ ఒకటి భక్తులకు ఇచ్చేవిధముగా, రెండవది దేవస్థానం కు ఉండే విధముగా ఏర్పాటు చేశారు. ఐతే మొదట్లో సవ్యంగా జరిగిన వ్యవహారం, రానురాను రెండు రశీదులు కూడా భక్తులకు ఇచ్చి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది తమ జేబులు నింపుకునేవారు. పర్యవేక్షణ అధికారులు వచ్చి రశీదు పుస్తకాలు పరిశీలించకుండా ఎన్నివచ్చాయి, ఎఃత వసూలు అయ్యిందని అడిగి వెళ్ళేవాళ్ళు, ఇదే అదునుగా భావించి దేవస్థానం నందు పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఆరుగురు విద్వాన్ నాగముని, సోమశేఖర్ రాజు, హరిప్రసాద్, మునిశేఖర్, గంగరాజు, విజయ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సొమ్మును స్వాహా చేసినట్లు తెలిసినది. జులై నెలలో రికారడలు, రశీదు పుస్తకాలు పరిశీలన చేయగా నలబై ఏడువేల రెండువందల రూపాయలు తేడాలున్నాయని, మొదటి నుండి పరిశీలించిన యడల ఇంకా బయట పడే అవకాశం ఉందని ఆలయ కార్యనిర్వాహణాధికారి, మరియు ఉపకమీషనర్ ఏకాంబరం తెలియజేశారు. ఈ విషయం పైన ఆయన దేవాదాయ కమీషనర్ కు పిర్యాదు చేసి, కమీషనర్ వారి ఆదేశానుసారం, చౌడేపల్లి పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు శాశ్వత ఉద్యోగికి మెమో ఇవ్వడం జరిగిందని, కాంట్రాక్టు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఈఓ తెలిపారు.బోయకొండ గంగమ్మ దేవస్థానం లో జరిగిన సిబ్బంది చేతివాటం పై బుదవారం చౌడేపల్లి పోలీసులు దర్యాప్తు లో భాగంగా ప్రాథమిక విచారణ చేశారు.సి.సి. పుటేజులు పరిశీలించారు.పెద్దబోగం, చిన్నబోగం సమర్పించే ప్రదేశాన్ని సందర్శించారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: