Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి లో ఘటన పట్టపగలే దళితుల పై దాడి పెయింట్ షాపు యజమాని గంగాధరం, వాళ్ళ కుమారుడు అనీల్ పై పెద్దకొండామర్రికి చెందిన రాజేష్ దాడి, అనంతరం ఆటో డ్రైవర్ చెంగల్రాయుడు తన ఆటో సుమారు రెండుమూడు లక్షల విలువ చేసే పెయింట్ డబ్బాలు, తన ఆటోలో వేసుకొని వెళ్ళి పోయాడు అడ్డు వచ్చిన గంగాధరం, అతని కుమారుడు అనీల్ ను కొట్టి, కౌంటర్ లో గల సుమారు డెబ్బై వేలరూపాయలు తీసుకొని వెళ్ళాడు వెళ్తూ,వెళ్తూ తన వెంట తెచ్చుకొన్న తాళంతో షాపు షెట్టర్ దించి తాళం వేసుకొని వెళ్ళిపోయాడు ఈ దాడి విషయమై గంగాధరం స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు గంగాధరం ఎస్సి కులానికి చెందినవాడని తెలిసి కూడా దాడి చేసి, అతని పెయింట్ షాపులో దోపిడి చేయడం పై పలు దళిత సంఘాలు భగ్గుమన్నాయి వెంటనే చౌడేపల్లి పోలీసులు దాడిచేసిన రాజేష్, ఆటోడ్రైవర్ చెంగల్రాయలు పై ఎస్సి,ఎస్టి అత్యాచార నిరోదక చట్టం 1989 ప్రకారం చట్టరిత్యా చర్యలు తీసుకొవాలని పలువురు కోరడమైనది
Admin
Famous TV