Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామంలో ఓ వ్యవసాయ బావి నందు గుర్తు తెలియని వివాహిత మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందిందని కలకలం రేగింది ప్రజలు బావి వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు, సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు పోలీసులు బావిలో ఉన్న మృతదేహాన్ని స్థానికుల సహాయంతో బయటకు తీశారు ఆ వివాహిత తమ ఊరు ఆమె కాదని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు, బైరెడ్డిపల్లి ఎస్ఐ వెంకట నరసింహులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కొరకు తరలించారు, వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఎవరైనా బావిలో తోసేసారా ప్రమాదవశాత్తు జరిగిందా అనేది దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామన్నారు
Admin
Famous TV