Tuesday, 15 September 2026 08:22:25 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఫేమస్ టీవి న్యూస్ కు స్పందించిన అధికారులు

ఈగలు బాబోయ్ ఈగలు ఎటుచూసినా ఈగలే ఈగలు

Date : 18 January 2026 04:39 PM Views : 581

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : చౌడేపల్లి ఫేమస్ టీవీ న్యూస్ : అన్నమయ్య జిల్లాలోని, చౌడేపల్లి మండలంలోని కాగతి గ్రామపంచాయతీ, యనమసామనపల్లి కి కూతవేట దూరంలో ప్రీమియం కంపెనీ కి చెందిన కోళ్ళఫారాలు ఉన్నాయి. ఇక్కడ ఈ కంపెనీ ప్రారంభించి సుమారు 11 సంవత్సరాలు కాలస్తుంది. గతంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి మేనేజర్లు చాలా వరకు పారిశుద్యం, ప్రజారోగ్యం ను దృష్టిలో ఉంచుకొని, వారం, పదిరోజులకొకసారి క్రిమిసంహారక మందులను పిచికారి చేసేవారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆరు సంవత్సరాలనుండి ఇక్కడ పనిచేస్తున్న మేనేజర్, సిబ్బంది, యాజమాన్యం ఎవరు కూడా ప్రజారోగ్యం పైన దృష్టి సారించకపోవడంతో ఇక్కడ ఈగలు వ్యాప్తి చెందాయి, అంతే కాకుండా కోళ్ళ ఫారాలలో గల వ్యర్థాలను, వారు రీ సైక్లింగ్ చేసి, బయటకు సరఫరా చేయాల్సి ఉండగా, వాటిని అలాగే బహిరంగ ప్రదేశాలలో నిల్వవుంచడం వలన, అందులో గల వ్యర్థాలలో ఈగలు, దోమలు ఉత్పత్తై ఇటు పశుపక్షాదులు, ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతింటున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సదరు ప్రీమియర్ కంపెనీ పై చర్యలు తీసుకోవల్సిన అధికారులు వాళ్ళు ఇచ్చే మామూళ్ళ మత్తులో మునిగితేలుచున్నారు. ఇక్కడి నుండి వెలువడే దుర్వాసన తో ప్రజారోగ్యం ఏవిధంగా దెబ్బతింటుందంటే చాలా వరకు గాలి కాలుష్యం అయి ఊపిరితిత్తులకు సంబందించిన, శ్వాసకోశ సంబందించిన రోగాలతో చుట్టుప్రక్కల సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అవస్థలుపడుతున్నారు. ఏక్కడ చూసినా ఈగలు, మంచి నీరు సైతం కలుషితం అవుతుంది. భోజనం చేయాలంటే దోమతెరలు వాడుకోవాల్సివస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా ఈగలు స్వాగతం పలుకుతున్నాయి. ఇన్ని విధాలుగా ప్రజారోగ్యం దెబ్బతింటున్న నేపత్యం లో యాజమాన్యం సరైన సస్యరక్షణ చర్యలు పాటించడంలో విఫలమౌతుందని గ్రామస్తులు వాపోతున్నారు. కావున వెంటనే సంబందించిన అధికారులు సదరు ఈగలు పైన, దుర్వాసన పైన విచారణ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరడమైనది.పత్రికలలో వార్తాకథనాలు రావడంతో స్పందించిన అధికారులు వెటనే ఈగల నివారణ కు మందులు పిచికారి చేయించారు. వారు పిచికారి చేసిన మందుల కు ఏమాత్రము ఈగలు చలించలేదని, తాత్కాలిక ఉపశమనం చేయడం వలన ప్రయోజనం లేదని గ్రామస్తులు వాపోయారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :