Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ న్యూస్ : చిత్తూరు అపోలో యూనివర్సిటీ లో విద్యార్థినుల బాత్ రూమ్ లో రహస్య కెమెరాల వ్యవహారం పై పోలీస్ విచారణ కొనసాగుతున్నదని, దోషులను కఠినంగా శిక్షించాలని పోలీస్ వారిని కోరానని మానవ హక్కుల కమిషన్ మెంబర్ విజయ భారతి సాయనీ పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు మురకంబట్టులోని అపోలో యూనివర్సిటీ ని జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ సందర్శించి యూనివర్సిటీ సిబ్బందితో తో సమీక్ష నిర్వహించారు.అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల చిత్తూరు అపోలో యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్ రూమ్ లో రహస్య కెమెరాల వ్యవహారంను వార్తా పత్రికలు, టివి చానళ్ళ ద్వారా చూసి మానవ హక్కుల ఉల్లంఘన కింద సోమోటోగా తీసుకుని విచారణకు రావడం జరిగిందని తెలిపారు. సంఘటనకు సంబంధించి పోలీస్ విచారణ జరుగుతున్నదని, పూర్తి వివరాలను వెలువరించలేమని అన్నారు. అనుమానితులను పోలీస్ అరెస్ట్ చేయగా, ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చారని తెలిపారు. పోలీస్ అధికారులు పారదర్శకతతో విచారణను వేగవంతం చేసి దోషులను తొందరగా న్యాయస్థానం ముందు నిలిపి శిక్షపడేలా చూడాలని కోరామన్నారు. కళాశాలలో నియమాల ప్రకారం విద్యార్థుల సమస్యల పరిష్కారానానికి అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారన్నారు. కళాశాల విద్యార్థులతో ముఖాముఖీ మాట్లాడగా సమస్యలెవీ లేవని తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వీరితో పాటు కళాశాల ఛైర్మన్, అధ్యపకులతో సమీక్షించడం జరిగిందన్నారు.ఈ సమీక్షా సమావేశంలో లైసెన్ ఆఫీసర్లు, ఎన్ జ్యోతి, హరినాథ్ రెడ్డి, విశ్వవిద్యాలయ ఉపకులపతి వినోద్ బట్, డి.ఎస్.పి, సాయినాథ్, సీఐ నిత్య బాబుచీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నరేష్ రెడ్డి,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV