Monday, 14 September 2026 07:36:34 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

కోటి ఎనిమిది లక్షల రుపాయుల (1,08,00,000) విలువగల 600 మొబైల్ ఫోన్లు రికవరీ.

సత్ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు -...జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్. భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ

Date : 30 November 2023 04:52 PM Views : 594

Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : గత రెండు నెలల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా రూ 1,08,00,000 /- విలువగల 600 మొబైల్ ఫోన్లు రికవరీ. MOBIEL HUNT (WHATSAPP 9490617873) అప్లికేషన్, CEIR (Central Equipment Identity Register) పోర్టల్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. CEIR CITIZEN PORTAL ద్వారా మొబైల్ పోయిన వెంటనే పోర్టల్ నందు ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్ లో ఉన్న సమాచారం దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాకు అవుతుంది, అలాగే పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతూ ఉంది. తిరుపతి జిల్లాలో సెల్ ఫోను పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., వారు ఏర్పాటు చేసిన MOBIEL HUNT (WHATSAPP 9490617873) అప్లికేషన్ సేవల ద్వారా సదరు వాట్సప్ కు వచ్చిన ఫిర్యాదులపై గతంలో జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు 6విడతలలో రూ. 2,93,40,000/- విలువ గల 1630 సెల్ ఫోన్ లను రికవరీ చేసి సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు అందజేయడం జరిగింది. “ప్రసుత్తం 7వ విడతలో గత రెండు నెలల రోజుల వ్యవధిలోనే సుమారు రూ.1,08,00,000/- విలువ గల 600 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి జిల్లా ఎస్పీ కార్యాలయం నందు జరిగిన పత్రికా సమావేశం నందు జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్., గారు వివరాలను వెల్లడించి బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఇప్పటి వరకు MOBILE HUNT APPLICTION ద్వారా 07 విడతలకు గాను రూ.4,01,40,000/- విలువ గల మొత్తం 2230 మొబైల్ ఫోన్లు రికవరీ చెయ్యడం జరిగిందన్నారు. తిరుపతి తిరుమల సందర్శనకు నిత్యం వేలాది మంది యాత్రికులు వచ్చి వెళుతుంటారు. తిరుపతి బస్సు స్టేషన్ మరియు రైల్వే స్టేషన్ తదితర రద్దీ ప్రాంతాలలో మొబైల్ పోగొట్టుకోవడమో లేదా దొంగలించ బడడమో జరుగుతూ ఉంటుంది. ఈ విషయంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి 2023-ఫెబ్రవరి నెలలో MOBIEL HUNT (WHATSAPP 9490617873) అప్లికేషన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము. అలా పోగొట్టుకున్న మొబైల్స్ ను ఒక ప్రక్క రికవరీ చేసి, బాధితులకు అందజేస్తూ, మరో ప్రక్క పిక్ పాకెటర్ల కదలికలపై సిసి కెమేరాలతో ప్రవేక్షిస్తూ, విసిబల్ పోలీసింగ్ ను పెంచి అనుమానితులపై గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, యాత్రికులకు మెరుగైన సేవలను అందిస్తున్నామన్నారు. ప్రజల ఎవ్వరిదైనా మొబైల్ ఫోన్ పోతే పోలీస్ వారు ఏర్పాటు చేసిన MOBIEL HUNT 9490617873 నెంబర్ కు WhatsApp లో Hai లేదా HELP అని మెసేజ్ చేస్తే వచ్చే link నందు మీ యొక్క వివరాలను పూరించాలి. లేదా CEIR (Central Equipment Identity Register) పోర్టల్ నందు ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్ లో ఉన్న సమాచారం దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాకు అవుతుంది. అలాగే పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు అన్నారు. రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఐ.పి.యస్., గారి యొక్క ఆదేశాలపై తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి పర్యవేక్షణలో తిరుపతి సైబర్ క్రైమ్ సి.ఐ. ఓ.రామచంద్ర రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పోగొట్టుకున్న మొబైల్స్ ను రికవరీ చేసి భాదితులకు అందజేయడం జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లా పోలీసు MOBILE HUNT వాట్సాప్ సర్వీసులు, CIER పోర్టల్ గురించి పోలీసులు ఇప్పటికే ప్రజలకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా కల్పిస్తున్నారు. మీడియా కూడా తమవంతు సహకారం అందించాలని కోరుచున్నాము అని విన్నవించారు. జిల్లా ప్రజలే కాకుండా తిరుపతికు వచ్చు యాత్రికులు కూడా MOBILE HUNT వాట్సాప్ సర్వీసులు, CIER పోర్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవడం మాకు సంతోసదాయకం అని అన్నారు. ఈ సందర్భంగా సెల్ ఫోన్ రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ O.రామచంద్రారెడ్డి మరియు సైబర్ క్రైమ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్., గారు ప్రశంసా పత్రాలు అందజేసి, అభినందించినారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పిలు శ్రీ వెంకట్రావు పరిపాలన, శ్రీమతి విమల కుమారి నేర విభాగం, సైబర్ సెల్ సిఐ రామచంద్ర రెడ్డి మరియు సైబర్ క్రైమ్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: