Monday, 14 September 2026 07:09:17 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఎస్. వి వైద్య కళాశాలలో నిరంతర వైద్య విద్య కార్యక్రమం

Date : 31 March 2024 04:24 PM Views : 626

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : తిరుపతి, శ్రీ వెంకటేశ్వరా వైద్య కళాశాల, రోగ నిర్ధారణ శాస్త్రం (dept. Of pathology) వారి ఆధ్వర్యంలో నిరంతర వైద్య విద్యా కార్యక్రమాన్ని (continuous medical education) నిర్వహించారు. రక్త సంబంధించిన సమస్యలను గురించి ఈ సదస్సులో క్లుప్తంగా చర్చించడం జరిగింది. హెమటోపాథాలజీ అనేది లుకేమియా, లింఫోమా మరియు అనేక ఇతర రక్త రుగ్మతలు వంటి రుగ్మతలతో సహా రక్త కణాలు మరియు కణజాలాలకు సంబంధించిన వ్యాధుల అధ్యయనం మరియు నిర్ధారణతో వ్యవహరించే పాథాలజీ యొక్క ఒక విభాగం. రక్తం మరియు శోషరస వ్యవస్థలను ప్రభావితం చేసే వ్యాధులను గుర్తించడానికి మరియు వర్గీకరించడానికి రక్తపు స్మెర్స్, ఎముక మజ్జ నమూనాలు, శోషరస కణుపు బయాప్సీలు మరియు ఇతర కణజాలాలను హెమటోపాథాలజిస్టులు విశ్లేషిస్తారు. ఈ కార్యక్రమములో డా"రేవంత్, అస్టర్ హాస్పిటల్, బెంగళూరు; డా"ప్రదీప్, ఆనంద్ లాబ్స్, బెంగళూరు; డా"రామస్వామి, ప్రధానచార్యులు, పి ఇ. ఎస్. వైద్య కళాశాల, కుప్పం, మొదలగు పేరుగాంచిన వైద్యులు పాల్గొని పీ.జీ వైద్య విద్యార్థులకు బోధించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఇటువంటి కార్యక్రమాలు రోగనిర్ధారణ శాస్త్ర అభివృద్ధికి ఎంతో అవసరం అని, ఆసుపత్రిలో ఉన్న వైద్యులకు మరియు ల్యాబ్ లో ఉన్న వైద్యులకు వైద్య రంగంలో కలుగుతున్న కొత్త కొత్త మార్పులను అందిపుచ్చుకొని రోగ నిర్ధారణ చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వారిని కోరారు. రోగ నిర్ధారణ శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందినదని, ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యధిక పేషెంట్ లకు సెంట్రల్ ల్యాబ్ సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలు ఎప్పటికప్పుడు, అందించినట్లయితే పేద రోగులకు మెరుగైన వైద్యం అందించవచ్చునని ఈ సందర్భంగా రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా"జి.రవిప్రభు అన్నారు. ఈ కార్యక్రమములో రోగ నిర్ధారణ శాస్త్ర విభాగాధిపతి డా"భ్రమరాంబ; ఆచార్యులు డా" ఇంద్రాణి; మైక్రోబయాలజీ ఆచార్యులు, డా" డి. వి. ఎస్. మూర్తి; జనరల్ మెడిసిన్ ఆచార్యులు, డా" ఋషెంద్ర కుమారి; రోగ నిర్థారణ శాస్త్ర సహాయ ఆచార్యులు డా"నాగరాజ; డా"రాజశేఖర్; డా"స్వర్ణలత; డా"సుష్మ మరియు ఇతర సిబ్బంది, పీజీ వైద్య విద్యార్థులు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు మొదలగు పట్టణాలలోని వైద్య కళాశాల లోని పీజీ విద్యార్థులు సుమారు 100 మంది పాల్గొనడం జరిగింది. కొత్త విషయాలను ఈ కార్యక్రమంలో చర్చించడమే కాకుండా ప్రశ్నలు - సమాధానాలు (quiz) చర్చ కార్యక్రమం కూడా నిర్వహించారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :